NDTV Adani : అదానీ ప్ర‌య‌త్నానికి ఎన్డీటీవీ అవ‌రోధం

ప్ర‌ణ‌య్ రావ్..రాధిక రాయ్ పై సెబీలో నిషేధం

NDTV Adani : ప్ర‌ముఖ న్యూస్ ఛాన‌ల్ ఎన్డీటీవీ కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ గౌతం అదానీ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను అడ్డుకునేందుకు ప్ర‌సార సంస్థ యాజ‌మాన్యం(NDTV Adani) తీవ్రంగా ప్ర‌య‌త్నం చేస్తోంది.

రెగ్యులేట‌రీ స‌మ‌స్య‌ల‌పై అదానీ టేకోవ‌ర్ ను నిరోధించేందుకు నానా తంటాలు ప‌డుతోంది. ఇప్ప‌టికే 29 శాతం కొనుగోలు చేసేందుకు భారీ ఆఫ‌ర్ ప్ర‌క‌టంచింది ఎన్డీటీవీ.

ఇదిలా ఉండ‌గా స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో ఎన్డీటీవీ వ్య‌వ‌స్థాప‌కులు ప్ర‌ణయ్ రాయ్, రాధిక రాయ్ 2020 నుండి భార‌త దేశ సెక్యూరిటీల మార్కెట్ లో వాటాల‌ను కొనడం లేదా అమ్మ‌డం నుండి నిషేధింప‌బ‌డ్డారు.

దీంతో అదానీ నియంత్ర‌ణ కోసం ప్ర‌య‌త్నం చేస్తున్న షేర్ల‌ను బ‌దిలీ చేయ‌లేరు. ఆ అవ‌కాశం వారికి ఉండ‌దు. ఇక ఎంత మాత్రం షేర్ల‌ను బ‌దిలీ చేయ‌లేరు. మ‌రో వైపు గౌత‌మ్ అదానీ గ్రూప్ అనుబంధ సంస్థ ఏఎంఎన్ఎల్ మీడియా వ్యాపారాన్ని క‌లిగి ఉంది.

న్యూఢిల్లీ టెలివిజ‌న్ లిమిటెడ్ (ఎన్డీటీవీ) గురువారం గౌత‌మ్ అదాన న్యూస్ నెట్ వ‌ర్క్ లో మెజారిటీ వాటాను పొందే ప్ర‌య‌త్నాన్ని నిరోధించాల‌ని కోరింది.

నియంత్ర‌ణ ప‌రిమితుల వ‌ల్ల బిలియ‌నీఈర్ వ్యాపార‌వేత్త స‌మూహం నుండి బిడ్ ను కొన‌సాగించ లేమంటూ స్ప‌ష్టం చేసింది. కాగా త‌మ‌తో ఎలాంటి చ‌ర్చ‌లు జ‌ర‌ప‌కుండానే ఎలా అదానీ కొనుగోలు చేస్తారంటూ ప్ర‌శ్నించింది ఎన్డీటీవీ యాజ‌మాన్యం.

ఇది పూర్తిగా ఊహించ‌నిది , ఎటువంటి చ‌ర్చ లేకుండా చోటు చేసుకుందంటూ పేర్కొంది. ఇదిలా ఉండ‌గా త‌ప్పుడు లాభాలు పొందిన‌ట్లు ఎన్డీటీవీ స‌మ‌ర్పించింద‌ని అందుకే న‌వంబ‌ర్ 26, 2022 దాకా ట్రేడింగ్ చేయ‌కుండా నిషేధం విధించింది.

Also Read : ఎన్‌డీటీవీలో మెజారిటీ వాటా అదానిదే

Leave A Reply

Your Email Id will not be published!