LT Gen Anil Chauhan : భారత త్రివిధ దళాధిపతిగా అనిల్ చౌహాన్
జనరల్ బిపిన్ రావత్ తర్వాత పదోన్నతి
LT Gen Anil Chauhan : భారత దేశ త్రివిధ దళాధిపతి (చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ) గా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. దేశంలో రక్షణ రంగానికి సంబంధించి ఇదే అత్యున్నతమైన పదవి. ఇదిలా ఉండగా సీడీఎస్ గా నియమితులైన అనిల్ చౌహాన్ మే 2021లో ఈస్టర్న్ కమాండ్ చీఫ్ గా పదవీ విరమణ చేశారు.
దేశంలో అత్యున్నత పదవిగా భావించే ఈ పదవిలో కొలువు తీరిన జనరల్ బిపిన్ రావత్ తొమ్మిది నెలల కిందట తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకున్న విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. సుదీర్ఘ కాలం తర్వాత ఈ కీలక పోస్టులో తర్జన భర్జనలు పడింది మోదీ ప్రభుత్వం.
చివరకు రిటైర్డ్ జనరల్ అనిల్ చౌహాన్(LT Gen Anil Chauhan) ను కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా నియమించింది. దీనికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోదం తెలిపారు. కాగా దేశంలోనే ఈ పోస్టు అత్యున్నతమైనదిగా భావిస్తారు. అంతే కాదు ప్రపంచంలోని అతి పెద్ద సాయుధ దళాల నాయకుడు అనిల్ చౌహాన్.
ఇప్పటి వరకు పదవి విరమణ చేసినా జాతీయ భద్రతా మండలిలో సైనిక సలహాదారుగా పని చేస్తున్నారు. తన 40 ఏళ్ల కెరీర్ లో అనేక పదవులను చేపట్టారు. ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ , ఈశాన్య ప్రాంతంలో తిరుగుబాటు నిరోధక కార్యకలాపాలను అదుపు చేయడంలో కీలక పాత్ర పోషించారు అనిల్ చౌహాన్.
పదవీ విరమణ పొందిన అధికారిని ఉన్నత పదవిలో నియమించడం ఇదే మొదటిసారి. దీంతో నియామకానికి సంబంధించిన రూల్స్ ను మార్చేందుకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
Also Read : భారత అటార్నీ జనరల్ గా వెంకటరమణి