New Flight Service to Mumbai: విజయవాడ నుండి ముంబైకు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం !

విజయవాడ నుండి ముంబైకు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం !

New Flight Service to Mumbai: ఏపీలో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే విజయవాడకు ప్రాథాన్యత ఏర్పడింది. గత ఐదేళ్ళుగా నిర్లక్ష్యానికి గురైన రాజధాని అమరావతి పనులు ప్రారంభం చేసారు. ఇది జరిగి 48 గంటలు తిరగకముందే… గన్నవరం నుండి ముంబైకు కొత్త విమాన సర్వీసులను ప్రారంభించారు. ఈ విజయవాడ – ముంబయి విమాన సర్వీసు ప్రారంభోత్సవానికి విజయవాడ(Vijayawada) ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీలు మాట్లాడుతూ… రాబోయే రోజుల్లో గన్నవరం నుంచి మరిన్ని నూతన విమాన సర్వీసులు నడిపేందుకు కృషి చేస్తామని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ అన్నారు.

New Flight Service to Mumbai…

ఈ సందర్భంగా బాలశౌరి మాట్లాడుతూ… ‘‘గన్నవరం నుంచి ముంబయికి ఎయిర్ లైన్స్ సర్వీస్ ప్రారంభించాం. ఈ విమానం ముంబయిలో మధ్యాహ్నం 3.57 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. రాత్రి 7.10 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి 9.00 గంటలకు ముంబయిలో ల్యాండ్‌ అవుతుంది. ఈ ప్రాంత ప్రజలకు ఈ సేవలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.

రాబోయే రోజుల్లో విజయవాడ(Vijayawada) నుంచి అనేక ప్రాంతాలకు మరిన్ని సర్వీసులను విస్తరిస్తాం. గన్నవరం నుంచి కోల్‌కతాకు విశాఖ మీదుగా విమాన సర్వీసు నడిపే ప్రతిపాదనను పరిశీలిస్తున్నాం. వారానికి రెండు రోజులు వారణాసి వెళ్లేందుకు కొత్త విమాన సర్వీసు కోసం ప్రయత్నిస్తున్నాం. విజయవాడ నుంచి సింగపూర్ వెళ్లే విమాన సర్వీసును మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం. థాయ్‌లాండ్‌, శ్రీలంక సర్వీసులు తీసుకొచ్చేందుకు… ఢిల్లీ నుంచి మరో రెండు సర్వీసులు అదనంగా వేసేలా మా వంతు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాం. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల కొత్త టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం ఆలస్యమైంది. దాన్ని త్వరలోనే పూర్తి చేస్తాం’’ అని బాలశౌరి వివరించారు.

విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ మాట్లాడుతూ ‘‘బాలశౌరి చొరవతో ముంబయికి సర్వీసులను నడిపేందుకు ఎయిరిండియా ముందుకొచ్చింది. ఏఐ599 సర్వీసులో 180 సీటింగ్‌ కెపాసిటీ ఉంటుంది. వ్యవసాయ, మత్స్య ఉత్పత్తులను కూడా ఈ సర్వీసు ద్వారా ముంబయికి.. అక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది’’ అని చెప్పారు.

Also Read : Nara Chandrababu Naidu: కార్యకర్తలకు చంద్రబాబు గుడ్ న్యూస్ ! త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ !

Leave A Reply

Your Email Id will not be published!