Congress New Rules : కాంగ్రెస్ స‌భ్యుల‌కు కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు

డ్ర‌గ్స్ .మ‌త్తు ప‌దార్థాల‌కు దూరంగా ఉండాలి

Congress New Rules : కాంగ్రెస్ పార్టీ త‌న మేనిఫెస్టోలో కొన్ని స‌వ‌ర‌ణ‌లు చేసింది. మాన‌సిక ప‌దార్థాలు, నిషేధించ‌బ‌డిన డ్ర‌గ్స్ , మ‌త్తు ప‌దార్థాల వినియోగానికి దూరంగా ఉండాల‌ని పార్టీ లోని కొత్త స‌భ్యుల‌ను కోరింది. ఛ‌త్తీస్ గ‌ఢ్ లోని రాయ్ పూర్ లో 85వ పార్టీ ప్లీన‌రీలో ఈ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది కాంగ్రెస్. సైకో ట్రోపిక్ ప‌దార్థాలు, డ్ర‌గ్స్ కు దూరంగా ఉండాల‌ని సూచించింది. ఈ సంద‌ర్భంగా ఛత్తీస్ గ‌ఢ్ సీఎం భూపేష్ బ‌ఘేల్ కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీని అభినందించారు.

ఆయ‌న చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర పార్టీకి బూస్ట్ లాగా ప‌ని చేసింద‌న్నారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం పార్టీ కూడా జోడో యాత్ర‌ను బేస్ గా చేసుకుని 2024 ఎన్నిక‌ల‌కు సంబంధించి మేనిఫెస్టోను త‌యారు చేయాల‌ని(Congress New Rules) సోనియా గాంధీ ఆదేశించారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల్లోకి బీజేపీ చేస్తున్నాగ‌డాల‌ను, దుర్మార్గాల గురించి ప్ర‌చారం చేయాల‌ని కోరారు. ఇక పార్టీ స‌వ‌ర‌ణ‌ల ప్ర‌కారం కొత్త స‌భ్యులు స‌మాజం కోసం ప్రజా ఆస్తుల సృష్టికి సంబంధించిన ప‌నులు, ప్రాజెక్టుల‌లో పాల్గొనాల్సి ఉంటుంది.

ఇందులో శ్ర‌మ‌దాన్ ( కార్మిక విరాళం) , ర‌క్త‌దాన శిబిరాలు , ముఖ్యంగా అణ‌గారిన‌, పేద వ‌ర్గాల‌కు సామాజిక న్యాయం, స‌మాన‌త్వం, సామ‌ర‌స్యం కోసం సేవ చేస విధానాన్ని అవ‌లంబించాల‌ని పేర్కొంది పార్టీ. కొత్త‌గా చేరిన స‌భ్యులు భూమికి సంబంధించిన సీలింగ్ చ‌ట్టాల‌ను ఉల్లంఘించ లేద‌ని హామీ ఇవ్వాల్సి ఉంటుంది. పార్టీ ఆమోదించిన విధానాలు, కార్య‌క్ర‌మాల‌ను బ‌హిరంగంగా వ్య‌క్తం చేయ‌కూడ‌దు .

Also Read : ఆప్..బీజేపీ కౌన్సిల‌ర్ల‌పై కేసు

Leave A Reply

Your Email Id will not be published!