ముంబై : టీమిండియా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు న్యూజిలాండ్ క్రికెటర్ మిచెల్. తను బుధవారం వన్డే సీరీస్ పై స్పందించాడు. తాము రాబోయే భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహించే టి20 ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బిగ్ టోర్నీ గురించి ఆలోచించడం లేదని అన్నాడు. కేవలం భారత్ తో స్వదేశంలో జరిగే మూడు మ్యాచ్ ల వన్డే సీరీస్ పై ఫోకస్ పెట్టామని చెప్పాడు. ఇందులో భాగంగా క్లీన్ స్వీప్ చేయాలన్నది తమ కోరిక అన్నాడు. అందుకు గాను తమ వ్యూహాలక పదును పెట్టామని చెప్పాడు మిచెల్. భారత జట్టు తమ జట్టును ఎదుర్కోనేందుకు పావులు కదుపుతుందని, ఆ విషయం తమకు తెలుసని అన్నాడు. అయితే టాప్ స్ట్రైకింగ్ ప్లేయర్ సంజూ శాంసన్ లేక పోవడం తమకు కలిసి వచ్చిన అంశమని పేర్కొన్నాడు.
ఇక శుభ్ మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టును ఈజీగా ఎదుర్కొనే సత్తా తమ బౌలర్లకు ఉందని చెప్పాడు మిచెల్. తమ దేశానికి చెందిన ఆటగాళ్లు పలువురు భారత దేశం నిర్వహించే ఐపీఎల్ లో భాగం గా ఉన్నారని, ఇక్కడి వాతావరణం, పరిస్థితుల గురించి వారికి పూర్తి అవగాహన ఉందన్నాడు. దీంతో తమకు ఇండియాతో ఆడడం అత్యంత తేలికైన విషయమని చెప్పాడు. ఇంకా నెల రోజుల పాటు జరగబోయే వరల్డ్ కప్ ఆలోచించడం లేదన్నాడు. కేవలం భారత బౌలర్లను ఎలా ఎదుర్కోవాలనే దానిపై ఫుల్ ప్రాక్టీస్ చేస్తున్నామని తెలిపాడు డారిల్ మిచెల్. టీమిండియా ఎన్ని జిమ్మిక్కులు చేసినా తమను ఎదుర్కోవడం ఆ జట్టుకు చాలా కష్టమని ముందే హెచ్చరించాడు.
