CM KCR : బీఆర్ఎస్ కే పట్టం నేనే సీఎం – కేసీఆర్
100 సీట్లకు పైగా బీఆర్ఎస్ కు ఖాయం
CM KCR : భారత రాష్ట్ర సమితి కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పవర్ లోకి రావడం ఖాయమని కుండ బద్దలు కొట్టారు. గురువారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా హాజరై సీఎం కేసీఆర్(CM KCR) ప్రసంగించారు.
ప్లీనరీకి హాజరైన ప్రతినిధులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరు నూరైనా సరే ప్రతిపక్షాలు ఓడి పోవడం ఖాయమని, ఇక భారత రాష్ట్ర సమితి ముచ్చటగా మూడోసారి తెలంగాణలో అధికారంలోకి రావడం పక్కా అని జోష్యం చెప్పారు కేసీఆర్.
ప్రాణాలకు తెగించి పోరాడినం. రాదనుకున్న తెలంగాణను తీసుకు వచ్చేలా చేసిన. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఏర్పాటైన తెలంగాణలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం జరిగిందన్నారు సీఎం. మొదటిసారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో 63 సీట్లు సాధించినం, రెండోసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు సాధించడం జరిగిందన్నారు. ఈసారి జరిగే ఎన్నికల్లో 100 సీట్లకు పైగా తమకు సీట్లు రావడం ఖాయమని మరోసారి జోష్యం చెప్పారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(CM KCR).
పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు సీఎం. నియోజకవర్గానికి పార్టీ పరంగా ఇద్దరు నాయకులు బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇవాళ ప్రతి రంగంలో తెలంగాణ టాప్ లో నిలిచిందన్నారు. మన రాష్ట్రం దేశానికి ఆదర్శ ప్రాయంగా నిలిచిందని చెప్పారు కేసీఆర్.
Also Read : మాదే రాజ్యం 100 సీట్లు ఖాయం -కేటీఆర్