NIA Raids : దేశ వ్యాప్తంగా పీఎఫ్ఐపై ఎన్ఐఏ దాడులు

అయిదు రాష్ట్రాల‌లో విస్తృత సోదాలు

NIA Raids : మ‌రోసారి దేశ వ్యాప్తంగా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు జూలు విదిల్చాయి. ఇప్ప‌టికే దేశంలో అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తూ, విధ్వంస‌క కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతూ , విదేశీ నిధుల‌ను పెద్ద మొత్తంలో పోగు చేసిన పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సంస్థ‌పై మ‌రోసారి దాడులు ముమ్మ‌రం చేశారు.

మంగ‌ళ‌వారం ప‌లు చోట్ల అయిదు రాష్ట్రాల‌కు పైగా సోదాలు జ‌రుగుతున్నాయి. మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, అస్సాం, తెలంగాణ‌, ఉత్త‌ర ప్ర‌దేశ్ , ఢిల్లీలో ద‌ర్యాప్తు

సంస్థ‌లు పీఎఫ్ఐ కార్య‌క‌లాపాలపై ఆరా తీస్తున్నాయి. ఇప్ప‌టికే 106 మందికి పైగా పాపుల‌ర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను

అదుపులోకి తీసుకుంది.

ఇదిలా ఉండ‌గా పీఎఫ్ఐ తీవ్ర‌వాద సంస్థ‌ల‌కు నిధులు స‌మ‌కూరుస్తోంద‌ని, యువ‌త‌కు క‌రాటే నేర్పిస్తామంటూ ఉగ్ర‌వాదులుగా , దేశ ద్రోహులుగా త‌యారు చేస్తోంద‌ని ఎన్ఐఏ, ఈడీ, సీబీఐ ఆరోపించాయి. ఉగ్ర‌వాదానికి ఊతం ఇవ్వ‌డం, దేశంపై విద్వేషాన్ని రెచ్చ‌గొట్ట‌డం, ముస్లిం యువ‌కుల‌కు ఆయుధ శిక్ష‌ణ ఇవ్వ‌డం, తీవ్ర‌వాద సంస్థ‌ల్లో చేరేందుకు వారిని స‌మూలంగా మార్చ‌డం వంటి ఆరోప‌ణ‌లు ఉన్నాయి పీఎఫ్ఐపై.

జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అందించిన ఇంటెలిజెన్స్ ఇన్ పుట్ ల ఆధారంగా ఈ దాడులు(NIA Raids) ముమ్మ‌రం చేశారు. ఢిల్లీఈ పోలీసుల

ప్ర‌త్యేక విభాగం రోహిణి, నిజాముద్దీన్ , జామియా, షాహీన్ బాగ్ , సెంట్ర‌ల్ ఢిల్లీతో పాటు ప‌లు ప్రాంతాల్లో దాడులు చేప‌ట్టింది. ఒక్క ఢిల్లీలోని ఇప్ప‌టి వ‌ర‌కు 30 మందిని అదుపులోకి తీసుకున్నారు.

మ‌హారాష్ట్ర లోని ఔరంగాబాద్, షోలాపూర్ ల‌లో సైతం దాడులు కొన‌సాగుతున్నాయి. బాగల్ కోట్ , బీద‌ర్ , చామ‌రాజ‌న‌గ‌ర్ , చిత్ర‌దుర్గ‌, రామ‌న‌గ‌ర‌,

మంగ‌ళూరు, కొప్ప‌ల్, బ‌ళ్లారి, కోలార్, బెంగళూరు, మైసూర్ , విజ‌య‌పుర ల‌లో పీఎఫ్ఐ నేత‌ల ఇళ్ల‌పై దాడులు జ‌రిగాయి.

దీనికి అనుబంధంగా ఉన్న సోష‌ల్ డెమోక్ర‌టిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) కి చెందిన 75 మందికి పైగా కార్య‌క‌ర్త‌ల‌ను క‌ర్ణాట‌క‌లో అరెస్ట్ చేశారు. మ‌ధ్య

ప్ర‌దేశ్ లో ఇప్ప‌టి దాకా 21 మందిని అరెస్ట్ చేశారు. యూపీలో సైతం జ‌ల్లెడ్ ప‌డుతున్నారు.

Also Read : స‌ద్గురు’కు చ‌ట్టం వ‌ర్తించదా

Leave A Reply

Your Email Id will not be published!