Nikhath Zareen : క్రీడా ప్రాంగ‌ణం జ‌రీన్ సంతోషం

ఇండోర్ స్టేడియం అభివృద్దికి ఫిదా

Nikhath Zareen : తెలంగాణ‌కు చెందిన ప్ర‌ముఖ బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆమె త‌న వృత్తిలో ఎన్నో అవార్డులు, పుర‌స్కారాలు పొందారు. అంతే కాకుండా భార‌త రాష్ట్ర స‌మితి ప్ర‌భుత్వం నిఖ‌త్ జ‌రీన్ కు బ‌హుమానం ప్ర‌క‌టించింది. ఇంటి స్థ‌లం కూడా కేటాయించింది. ఆమె విదేశాల‌లో పాల్గొనే పోటీల‌కు సంబంధించి అయ్యే ఖ‌ర్చును కూడా మొత్తం ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌ని స్ప‌ష్టం చేసింది. ఈ సంద‌ర్భంగా సీఎంను క‌లిశారు నిఖ‌త్ జ‌రీన్(Nikhath Zareen). ఆయ‌న ఆమెను ప్ర‌త్యేకంగా అభినందించారు.

ఇదిలా ఉండ‌గా తెలంగాణ స‌ర్కార్ క్రీడాభివృద్ది కోసం ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టింది. భారీ ఎత్తున నిధుల‌ను కూడా కేటాయించింది. ఇటీవ‌లే సీఎం కేసీఆర్ పేరుతో క‌ప్ ను కూడా చేప‌ట్టింది. గ్రామీణ‌, మండ‌ల‌, నియోజ‌క‌వ‌ర్గ‌, జిల్లా, రాష్ట్ర స్థాయిల‌లో ప్ర‌తిభ క‌లిగిన క్రీడాకారుల‌ను ప్రోత్స‌హించేందుకు నిర్ణ‌యించింది. ఇందుకు భారీ ఎత్తున నిధుల‌ను ఖ‌ర్చు చేస్తోంది.

అంతే కాకుండా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల‌లో ఇప్ప‌టికే ఉన్న క్రీడా ప్రాంగ‌ణాల‌ను మ‌రింత అభివృద్ది చేస్తోంది రాష్ట్ర క్రీడా శాఖ‌. ఈ మేర‌కు మంత్రి విర‌స‌నోళ్ల శ్రీ‌నివాస్ గౌడ్ ఆధ్వ‌ర్యంలో ప‌నులు ప్ర‌గ‌తి ప‌థంలో న‌డుస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా తాజాగా భువ‌న‌గిరి ప‌ట్ట‌ణంలో నిరుప‌యోగంగా ఉన్న ఇండోర్ స్టేడియాన్ని అత్య‌ద్భుతంగా తీర్చి దిద్దారు. భారీ ఎత్తున ఖ‌ర్చు చేసింది రాష్ట్ర స‌ర్కార్. ఇందుకు సంబంధించి తెలంగాణ బాక్స‌ర్ నిఖ‌త్ జ‌రీన్ సంతోషం వ్య‌క్తం చేశారు. ప్ర‌త్యేకంగా అభినందించారు.

Also Read : Bhatti Vikramarka : దొర పాల‌న‌లో స్కాంలు..క‌మీష‌న్లు

 

Leave A Reply

Your Email Id will not be published!