Nimmagadda Ramesh Kumar: పింఛన్ల పంపిణీ ఆలస్యంపై నిమ్మగడ్డ రమేష్ కీలక వ్యాఖ్యలు !

పింఛన్ల పంపిణీ ఆలస్యంపై నిమ్మగడ్డ రమేష్ కీలక వ్యాఖ్యలు !

Nimmagadda Ramesh Kumar: ఏపీ రాజకీయాలు పెన్షన్ల చుట్టూ తిరుగుతున్నాయి. గతంలో పలు సందర్భాల్లో వాలంటీర్లపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యల ఆధారంగా… వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని సిటిజన్స్‌ ఫర్‌ డెమొక్రసీ (సీఎఫ్‌డీ) తరపున రాష్ట్ర ఎన్నికల సంఘం విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, సిటిజన్స్‌ ఫర్‌ డెమొక్రసీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్(Nimmagadda Ramesh Kumar) ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన అనంతరం వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఎన్నికల కమీషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి పెన్షన్ల పంపిణీను యథా తధంగా కొనసాగించాలని పేర్కొంది.

Nimmagadda Ramesh Kumar Comment

దీనితో సచివాలయం సిబ్బంది ద్వారా ప్రభుత్వం పెన్షన్ల పంపిణీను చేయాలని నిర్ణయించినప్పటికీ నిధుల విడుదలలో జాప్యం చేయడం వలన పలుచోట్ల పెన్షనర్లు గందరగోళానికి గురయ్యారు. ఈ క్రమంలో వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు తన అనుచర వర్గంతో ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసి వృద్ధులు వికలాంగుల చావుకు కారణమయ్యారంటూ వైసీపీ నేతలు పెద్ద ఎత్తున పెన్షనర్లలో ప్రచారం చేస్తున్నారు. అయితే తమకు అనుకూలంగా ఉన్న అధికారుల సహాయంతో పెన్షన్ల పంపిణీను ఉద్దేశ్యపూర్వకంగా జాప్యం చేసినట్లు విపక్షాల నుండి ఆరోపణలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, సిటిజన్స్‌ ఫర్‌ డెమొక్రసీ (సీఎఫ్‌డీ) ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో పింఛన్ల పంపిణీ ఆలస్యానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాను నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు. శనివారం నాడు సీఈఓ మీనాను నిమ్మగడ్డ రమేష్ కుమార్, మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం వెలగపూడిలోని సచివాలయంలో కలిశారు. రాష్ట్రంలో 65 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారన్నారు. వలంటీర్లతో సంబంధం లేకుండా పెన్షన్ పంపిణీ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించిందని తెలిపారు. వలంటీర్లతోనే పెన్షన్లను పంపిణీ చేయించాలని కొందరు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారని చెప్పారు.

Also Read : MLC Kavitha: సీబీఐ విచారణకు అనుమతి ఇవ్వడంపై కోర్టును ఆశ్రయించిన కవిత !

Leave A Reply

Your Email Id will not be published!