MLC Kavitha: సీబీఐ విచారణకు అనుమతి ఇవ్వడంపై కోర్టును ఆశ్రయించిన కవిత !

సీబీఐ విచారణకు అనుమతి ఇవ్వడంపై కోర్టును ఆశ్రయించిన కవిత !

MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి ప్రత్యేక కోర్టు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లిక్కర్‌ కేసులో సీబీఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్సీ కవిత… రౌస్‌ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కవిత తరఫు న్యాయవాది నితీష్‌ రాణా కోర్టులో మెన్షన్‌ చేశారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతిచ్చిన ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను రౌస్ అవెన్యూ కోర్టులో న్యాయవాది నితీష్‌ రాణా ప్రస్తావించారు. ఈ సందర్భంగా సీబీఐ దరఖాస్తును తమకు అందించలేదని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే కవితను సీబీఐ ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయడానికి సీబీఐ సమయం కోరింది. దీనితో ఈ నెల 10 వరకు సీబీఐకు సమయం ఇచ్చినట్లు కోర్టు తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 10న చేపట్టనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.

MLC Kavitha Approach

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో పలు సంచలనాలు నమోదయ్యాయి. ఈ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, బీఆర్‌ఎస్​ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) తీహార్‌ జైలులో ఉన్నారు. వారిని ఈ కేసు విషయమై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారిస్తోంది. లిక్కర్‌ స్కాం కేసులో కవిత నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని… ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ శుక్రవారం ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. కవిత తీహార్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న నేపథ్యంలో… అక్కడే విచారిస్తామని కోర్టుకు విన్నవించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన కొందరు కవిత పేరును ప్రస్తావించారని, ఈ నేపథ్యంలో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సిన అవసరం ఉందని వివరించింది. సీబీఐ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక కోర్టు.. జైలులో కవితను విచారించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తీహార్‌ జైలు అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కవితను విచారించేందుకు ఒక రోజు ముందుగానే జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని సీబీఐకి ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది.

Also Read : Sonia Gandhi : 370 సీట్లు గెలుచుకునేందుకు విపక్షాలను బీజేపీ చేరాలని బెదిరిస్తున్నారు

Leave A Reply

Your Email Id will not be published!