Nirmala Sitharaman : కేంద్ర ఆర్థిక మంత్రిపై కేసు నమోదుకు ఆదేశాలిచ్చిన ప్రత్యేక న్యాయస్థానం

దాంతో ఈ పిటిషన్‌పై శుక్రవారం కోర్టు విచారణ చేపట్టింది...

Nirmala Sitharaman : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కోర్టు షాక్ ఇచ్చింది. ఎన్నికల బాండ్ల నేపథ్యంలో బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు చేయాలని బెంగళూరులోని తిలక్ నగర్ పీఎస్‌ ‌పోలీసులను ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. ఈ ఆరోపణల కారణంగా జ్జానదికార్ సంఘర్ష పరిషత్ సంస్థ సహా అధ్యక్షుడు అదర్ష్ అయ్యార్ తిలక్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు స్వీకరించేందుకు తిలక్ నగర్ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గతేడాది ఏప్రిల్‌లో చట్టసభ ప్రతినిధుల కోర్టుతో ఆయన పిటిషన్ దాఖలు చేశారు.

Nirmala Sitharaman Got Case…

దాంతో ఈ పిటిషన్‌పై శుక్రవారం కోర్టు విచారణ చేపట్టింది. అందులోభాగంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. అనంతరం ఈ కేసు విచారణను అక్టోబర్ 10వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌, ఈడీ ఉన్నధికారులు, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కర్ణాటక బీజేపీ అగ్రనేతలు నళిని కుమార్ కతీల్, విజయేంద్రలకు వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read : Rain Alert : ఈరోజు ఆయా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు – ఐఎండీ

Leave A Reply

Your Email Id will not be published!