Nithyananda Kailaasa : ‘కైలాస‌’కు మ‌ద్ద‌తు ఇవ్వండి

స్వామి నిత్యానంద పిలుపు

Nithyananda Kailaasa : ఎన్నో ఆరోప‌ణ‌ల మ‌ధ్య అరెస్ట్ త‌ప్పించుకుని దేశం విడిచి పారి పోయిన వివాదాస్ప‌ద గురు , త‌న‌ను తాను దైవాంస సంభూతుడిన‌ని పేర్కొనే స్వామి నిత్యానంద మ‌రోసారి హాట్ టాపిక్ గా మారారు. త్వ‌ర‌లో గురు పూర్ఙిమ‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు కైలాస దేశం త‌ర‌పున వెల్ల‌డించారు. ఇందులో భాగంగా కైలాసా పాట్రియ‌న్ క‌మ్యూనిటీలో చేరాల‌ని పిలుపునిచ్చారు స్వామి నిత్యానంద‌. స్థాప‌క సంభంగా మారే అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపారు. కైలాస‌కు మ‌ద్దతు ఇవ్వాల‌ని, కీల‌క పాత్ర పోషించాల‌ని కోరారు స్వామి నిత్యానంద‌.

ఇదే స‌మ‌యంలో నిత్యా నంద‌ను ద‌ర్శించు కోవాల‌ని అనుకునే వారు, లేదా ఆయ‌న ఆశీస్సులు పొందాల‌ని ప‌రిత‌పించే వారు, భ‌క్తులు ఎవ‌రైనా ఉంటే వెంట‌నే త‌మ‌ను సంప్ర‌దించాల‌ని సూచించారు. శ్రీ‌శ్రీశ్రీ నిత్యానంద‌ను(Nithyananda) ద‌ర్శించు కోవాల‌ని, స్వామి కృప‌కు పాత్రులు కావ‌ల‌ని కోరారు కైలాస భ‌క్త బృందం. మాతో చేరండి అసాధార‌ణ‌మైన వాటిలో భాగం కండి అంటూ పిలుపు నివ్వ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

ఇదిలా ఉండ‌గా శ్రీ నిత్యానంద ప‌రమ శివం కైలాస పున‌రుద్ద‌ర‌ణ చేశాడ‌ని చెపుతోంది సంస్థ‌. పురాత‌న‌, జ్ఞానోద‌య‌, హిందూ నాగ‌రిక‌త దేశంగా కైలాస ఉంద‌ని తెలిపింది. కైలాసా ప్ర‌పంచ శాంతి కోసం ప‌ని చేస్తుంద‌ని పేర్కొంది. అంతే కాకుండా నిత్యానంద యూనివ‌ర్శిటీ ప్ర‌పంచంలోనే అతి పెద్ద హిందూ విశ్వ విద్యాల‌య‌మ‌ని వెల్ల‌డించింది. ప్ర‌తి రోజూ ఉద‌యం 8 గంట‌ల‌కు తిరిగి రాత్రి 8 గంట‌ల‌కు ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాల ద్వారా శ్రీ నిత్యానంద బోధ‌న‌లు వినాల‌ని కోరింది.

Also Read : Gidugu Rudra Raju : వ‌ర్మ ‘వ్యూహం’ కాంగ్రెస్ ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!