Nitish Kumar Attack : బీహార్ సీఎంపై దాడి – వ్య‌క్తి అరెస్ట్

పోలీసుల విచార‌ణ ప్రారంభం

Nitish Kumar Attack : బీహార్ లో సీఎం నితీష్ కుమార్ పై దాడి జ‌రిగిన ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఫుల్ సెక్యూరిటీ ఉన్న‌ప్ప‌టికీ ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి దాడికి పాల్ప‌డ‌డం విస్తు పోయేలా చేసింది.

ఈ ఘ‌ట‌న నితీష్ కుమార్ స్వ‌స్థ‌లంలో ఫంక్ష‌న్ సంద‌ర్భంగా చోటు చేసుకుంది. బీహార్ లోని భ‌క్తియార్ పూర్ లో సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar Attack) ను ఓ వ్య‌క్తి వెనుక నుంచి ఢీ కొట్టాడు.

సీసీ టీవీ కెమెరాలో చిక్కుకున్న వ్య‌క్తిని అరెస్ట్ చేశామ‌ని , ప్ర‌స్తుతం పోలీసుల అదుపులో ఉన్నార‌ని తెలిపాయి. స్థానిక ఆస్ప‌త్రి కాంప్లెక్స్ లో రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర స‌మ‌ర యోధుడు శిల్పాద్ర యాజీ విగ్ర‌హానికి సీఎం నివాళులు అర్పించేందుకు వెళుతుండ‌గా ఈ దాడి ఘ‌ట‌న జ‌రిగింది.

సీసీ టీవీ కెమెరా ల్లోని ఫుటేజీలు చూపించాయి. వెనుక నుంచి వ‌చ్చిన దుండ‌గుడు వ్య‌క్తి వేగంగా అడుగులు వేస్తూ సీఎం నితీష్ కుమార్ ను వీపుపై కొట్ట‌డం స్ప‌ష్టంగా క‌నిపించింది.

వెంట‌నే అత‌డిని ప‌ట్టుకున్నారు సీఎం సెక్యూరిటీ సిబ్బంది. ఈ ఘ‌ట‌న గురించి దేశానికి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు ఆరా తీశారు.

Also Read : బెంగాల్ లో ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించండి

Leave A Reply

Your Email Id will not be published!