Nitish Kumar : మహా కూటమి ఖాయం – నితీశ్
కాంగ్రెస్ తో కలిసేందుకు సిద్దం
Nitish Kumar : దేశంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయంగా ప్రతిపక్షాలను ఏకం చేసే పనిలో పడ్డారు బీహార్ సీఎం నితీశ్ కుమార్(Nitish Kumar). ఆయన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఖర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీతో పాటు ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో సమావేశం అయ్యారు. దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలను ఒకే గొడుగు కిందకు తీసుకు వచ్చేందుకు తాను ప్రయత్నం చేస్తున్నది వాస్తవమేనని స్పష్టం చేశారు నితీశ్ కుమార్.
ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాల ఐక్యత సాధ్యమేనా అన్న ప్రశ్నకు అవునని చెప్పారు. మహా కూటమిగా ఏర్పడడం ఖాయమని జోష్యం చెప్పారు. ఇందులో చాలా పార్టీలు ముందుకు వచ్చాయని, ఇంకా కొన్ని పార్టీలతో , నేతలతో మాట్లాడాల్సి ఉందన్నారు. అనుమాన పడాల్సిన అవసరం ఏం వచ్చిందని ఎదురు ప్రశ్న వేశారు సీఎం. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సమాన దూరంలో ఉన్న పార్టీలను కూడా ఒకే గొడుగు కిందకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.
అతి త్వరలో చాలా పార్టీలు ఏక తాటి పైకి వస్తాయన్నారు నితీశ్ కుమార్(Nitish Kumar). తాను కాంగ్రెస్ పార్టీ సీనియర్లతో చర్చించా. మిగతా వారితో కూడా మాట్లాడాను. వారంతా అంగీకారం తెలిపారని చెప్పారు సీఎం. నిన్న సీపీఐతో కూడా చర్చించానని వారు కూడా ఓకే చెప్పారని అన్నారు.
అన్ని పార్టీలు కలిసి కూర్చుని ఏం చేయాలనే దానిపై చర్చిస్తాయని తెలిపారు. జేడీయూ కార్యకర్తలకు కూడా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. త్వరలో కేసీఆర్, దీదీని కూడా కలుస్తానని అన్నారు నితీశ్ కుమార్. అఖిలేష్ యాదవ్ ను ఒప్పించే బాధ్యతను డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కు అప్పగించామన్నారు.
Also Read : బీజేపీకి 35 సీట్లిస్తే దీదీ సర్కార్ క్లోజ్