Nitish Kumar CM : ఉప రాష్ట్రపతి కావాలన్నది ఓ జోక్ – నితీశ్
బీజేపీ కామెంట్స్ సీఎం సీరియస్
Nitish Kumar CM : బీహార్ సీఎం నితీశ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. 17 ఏళ్ల పాటు బీజేపీతో కలిసి సాగించిన సంకీర్ణ ప్రయాణానికి ముగింపు పలికారు.
విచిత్రం ఏమిటంటే భారతీయ జనతా పార్టీకి చెక్ పెట్టాక నితీశ్ కుమార్ కోలుకోలేని షాక్ ఇచ్చారు ట్రబుల్ షూటర్ అమిత్ షాకు. ఇందులో భాగంగా బీజేపీ నుంచి విడి పోయాక సంచలన వ్యాఖ్యలు చేశారు.
నితీశ్ కుమార్ ఉప రాష్ట్రపతి కావాలని కోరుకున్నారని ఆరోపణలు చేశారు. దీనిపై నిప్పులు చెరిగారు సీఎం నితీశ్ కుమార్. ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐంఎల్ తో కలిసి మహా కూటమి ఏర్పాటుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
సీఎంగా నితీశ్ కుమార్ , డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలో ఎనిమిదో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
తాను ఉప రాష్ట్రపతి కావాలని ఏనాడూ అనుకోలేదన్నారు. బీజేపీ చేసిన వ్యాఖ్యలన్నీ అబద్దమని కొట్టి పారేశారు సీఎం. ఆయన వైస్ ప్రెసిడెంట్ అన్న దానిని ఓ జోక్ గా అభివర్ణించారు.
మోసం చేయడం, ఇతరులను ఇబ్బంది పెట్టడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు నితీశ్ కుమార్(Nitish Kumar CM). ఇన్నేళ్ల సహవాసంలో తనను తొలగించాలని ప్లాన్ చేసిందని కానీ వారి ఆటలు తన వద్ద సాగలేదన్నారు సీఎం.
ఇదే సమయంలో ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. 2014లో పీఎం అయ్యారు మరి 2024లో అవగలరా అని ప్రశ్నించారు. అన్ని రోజులు ఒకేలా ఉండవన్నారు నితీశ్ కుమార్.
Also Read : బీహార్ లో సీఎంకే దక్కనున్న హోం