Nitish Kumar: ‘మీకేమీ తెలియదు’ అంటు ఆర్జేడీ ఎమ్మెల్యేపై నీతీశ్ సీరియస్ !
‘మీకేమీ తెలియదు’ అంటు.. ఆర్జేడీ ఎమ్మెల్యేపై నీతీశ్ సీరీయాస్..!
Nitish Kumar: బిహార్ అసెంబ్లీ లో విపక్షాల ఆందోళనలతో సభ దద్దరిల్లింది. సహనం కోల్పోయిన సీఎం నీతీశ్ కుమార్ ఆర్జేడీ మహిళా ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బిహార్‌లో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపద్యంలో విపక్షాల ఆందోళనలతో బుధవారం అసెంబ్లీ దద్దరిల్లింది. రిజర్వేషన్లు, ప్రత్యేక హోదా అంశాలను ఎత్తి చూపుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నినాదాలు తో సభను హోరెత్తించారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ఆర్జేడీ కి చెందిన ఓ మహిళా ఎమ్మెల్యేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి అవకశాం ఇచ్చయి.
Nitish Kumar Comments
విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల ను 65 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పట్నా హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీంతో నీతీశ్(Nitish Kumar) ప్రభుత్వానికి గట్టి దెబ్బ తగిలినట్లయింది. మరోవైపు ఎన్డీఏ కూటమిలో భాగమైనప్పటికీ బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం పార్లమెటు సాక్షిగా స్పష్టం చేయడం అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారింది.
మరో వైపు ఈ అంశాలను ఎత్తిచూపుతూ తాజాగా విపక్షాలు అసెంబ్లీ సమావేశంలో ఆందోళనకు దిగాయి. నీతీశ్ ఎంత ప్రయత్నించినా శాంతించలేదు. ఆయనకు మాట్లాడేందుకు అవకాశం కల్పించకుండా చేశాయి. దీంతో నీతీశ్ ఆర్జేడీ మహిళా ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు. ‘‘మీరు ఓ మహిళ.. మీకేం తెలియదు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జనాభా నియంత్రణపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తాజాగా మహిళా ఎమ్మెల్యేపై నీతీశ్ చేసిన చేసిన వ్యాఖ్యలు మరోసారి తీవ్ర చర్చకు దారి తీశాయి
Also Read : MK Stalin: ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం స్టాలిన్ వార్నింగ్..!