Nitish Kumar : మీ సహకారం మరిచి పోలేనన్న సీఎం
సోనియా గాంధీకి నితీశ్ కుమార్ థ్యాంక్స్
Nitish Kumar : బీహార్ లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. జేడీయూ, బీజేపీ సంకీర్ణ 17 ఏళ్ల కూటమికి పుల్ స్టాప్ పడింది. ఈ మేరకు కాషాయానికి కటీఫ్ చెప్పారు జేడీయూ చీఫ్, సీఎం నితీశ్ కుమార్.
కేవలం ఒకే ఒక్క రోజులోనే రాజకీయాలను పూర్తిగా మార్చేశారు. ఈ సందర్భంగా ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐఎంఎల్ తో పాటు ఇతర పార్టీలతో కలిసి మహా ఘట్ బంధన్ లేదా మహా కూటమిని ఏర్పాటు చేశారు.
ఈ తరుణంలో నితీశ్ కుమార్ నేరుగా ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీకి ఫోన్ చేశారు. మేడం దయచేసి తనకు సపోర్ట్ ఇవ్వాల్సిందిగా కోరారు. ఆమె వెంటనే ఓకే చెప్పారు.
కానీ ఓ మాట రాహుల్ గాంధీతో కూడా మాట్లాడమని సూచించారు. దీంతో నితీశ్ కుమార్ కు లైన్ క్లియర్ అయ్యింది. ఎంతైనా రాజకీయంగా అనుభవం కలిగిన నాయకుడు కాబట్టి వెంటనే తేజస్వి యాదవ్ ను రంగంలోకి దింపాడు.
ఆయన ద్వారా రాహుల్ గాంధీకి ఫోన్ చేయించాడు. దీంతో సీన్ పూర్తిగా తన కంట్రోల్ లోకి తీసుకు వచ్చేలా చేశాడు నితీశ్ కుమార్.
మరో వైపు మరాఠా మోడల్ ను బీహార్ లో అమలు చేయాలని ప్లాన్ చేసిన అమిత్ షాకు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చాడు నితీశ్ కుమార్(Nitish Kumar). తన పార్టీలో ఉన్న ఆర్సీపీ సింగ్ ను ఎగదోయడాన్ని ముందే పసిగట్టి వెంటనే బీజేపీకి చెక్ పెట్టాడు.
దీంతో తన ఓటు బ్యాంకుతో పాటు బీజేపీకి ఇబ్బంది కలిగించాడు. ఇదే సమయంలో నితీశ్ గుడ్ బై చెప్పడంపై ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ప్రభావం రాబోయే సార్వత్రిక ఎన్నికలపై పడుతుందన్నాడు.
Also Read : నాలుగు రోజులు ఆగితే తెలుస్తుంది