TS TET 2022 : గంట ఆల‌స్య‌మైతే టెట్ కు నో చాన్స్

పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం

TS TET 2022 : సుదీర్గ కాలం త‌ర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక నిర్వ‌హిస్తున్న మొద‌టి ప‌రీక్ష టెట్(TS TET 2022). ఈ ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష‌కు పెద్ద ఎత్తున పోటీ ఏర్ప‌డింది.

ఇప్ప‌టికే 2 ల‌క్ష‌ల‌కు పైగా ఖాళీలు ఉన్నా కేవ‌లం 91 వేలు మాత్ర‌మే ఉన్నాయ‌ని సీఎం ప్ర‌క‌టించారు. ఈ త‌రుణంలో టీచ‌ర్ల పోస్టులు సంపాదించాలంటే త‌ప్ప‌నిస‌రిగా టెట్(TS TET 2022)  లో పాస్ కావాల్సిందే.

దీంతో ఈ ఎగ్జామ్ కోసం ఎక్కువ పోటీ నెల‌కొంది. గ‌తంలో ఎస్జీటీ, ఎస్ఏ కు వేర్వేరుగా అర్హులుగా నిర్ణ‌యించింది. కానీ ఈసారి బీఇడి చేసిన అభ్య‌ర్థులు సైతం టీజీటీకి అర్హుల‌ని పేర్కొన‌డంతో పెద్ద ఎత్తున అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

పేప‌ర్ -1 కు 3,51,468 మంది ప‌రీక్ష రాస్తారు. ఇక పేప‌ర్ -2 కు 2,77,884 ద‌ర‌ఖాస్తు రాయ‌నున్నారు. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.

టీచ‌ర్లు, లెక్చ‌ర‌ర్ల‌తో పాటు సెంట‌ర్లు ఎక్కువ‌గా ఉండ‌డంతో ఇత‌ర ప్ర‌భుత్వ శాఖ‌ల‌కు చెందిన ఉద్యోగుల‌ను కూడా ఇన్విజిలేట‌ర్లుగా నియ‌మించారు.

ఈనెల 12న ఆదివారం రెండు పేప‌ర్ల‌కు ప‌రీక్ష‌లు జ‌రుగుతాయి. ఇక టెట్ ప‌రీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,683 కేంద్రాలు ఏర్పాటు చేశారు.

అత్య‌ధికంగా హైద‌రాబాద్ లో 212 సెంట‌ర్లు ఉన్నాయి. ప్ర‌తి సెంట‌ర్ వ‌ద్ద సీసీ కెమెరాలు ఉన్నాయి. ప‌రీక్షకు ముందు నుంచి అయి పోయేంత దాకా వీడియో రికార్డింగ్ చేయాల‌ని ఆదేశించారు.

జిల్లా క‌లెక్ట‌ర్లు వీటిని ప‌ర్య‌వేక్షిస్తారు. ఇక ప‌రీక్ష విష‌యానికి వ‌స్తే పేప‌ర్ -1 ఉద‌యం 9.30 నుంచి 12 గంట‌ల దాకా ఉంటుంది. పేప‌ర్ -2 మ‌ధ్యాహ్నం 2.30 నుంచి 5 గంట‌ల దాకా ఉంటుంది.

అభ్య‌ర్థులు గంట ముందే ఎగ్జామ్ సెంట‌ర్ కు చేరుకోవాలి. నిమిషం ఆల‌స్య‌మైనా అనుమ‌తించరు.

Also Read : 13 నుంచే బ‌డులు ప్రారంభం

Leave A Reply

Your Email Id will not be published!