CM Nitish Kumar : బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వలేం
ప్రకటించిన బీహార్ సీఎం నితీశ్ కుమార్
CM Nitish Kumar : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటన. కేవలం కల్తీ మద్యం కారణంగా ఏకంగా ఇప్పటి వరకు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. తమ ప్రభుత్వం తాగొద్దని తాగితే చని పోతారని చెప్పిందని కానీ జనం వినిపించు కోలేదన్నారు సీఎం నితీశ్ కుమార్.
ఇందులో భాగంగా చని పోయిన వారికి నష్ట పరిహారం ఇవ్వాలంటూ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం నితీశ్ కుమార్(CM Nitish Kumar). అసెంబ్లీ సాక్షిగా తాము ఎట్టి పరిస్థితుల్లో తాగి చని పోయిన వారికి పరిహారం ఇవ్వలేమంటూ కుండ బద్దలు కొట్టారు.
బీహార్ లోని సరన్ , ఛప్రా జిల్లాలలో సహా రాష్ట్రంలో జరిగిన కల్తీ మద్యం బాధితులకు సంఘీభావంగా ప్రతిపక్ష నాయకుడు విజయ్ సిన్హా నేతృత్వంలో బీజేపీ ఎమ్మెల్యేలు శుక్రవారం గవర్నర్ ఫాగు చౌహాన్ నివాసానికి ర్యాలీ చేపట్టారు. కనీసం 50 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని సమాచారం.
మృత దేహాలను తగుల బెట్టడం ద్వారా మృతుల సంఖ్యను దాస్తున్నారంటూ సిన్హా ఆరోపించారు. ఇవాళ ఉదయం ప్రస్తుత డిప్యూటీ సీఎం, ఆర్జేడీకి చెందిన తేజస్వి యాదవ్ మాట్లాడటం ప్రారంభించగానే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడ్డుకునే ప్రయత్నం చేశారు. బీజేపీ ఎజెండా ఒక్కటే ద్వేషాన్ని వ్యాప్తి చేయడం తప్ప మరొకటి కాదన్నారు.
తమ ప్రభుత్వం ముందే కల్తీ మద్యాన్ని తాగవద్దంటూ నిషేధం విధించిందన్నారు డిప్యూటీ సీఎం. బీజేపీ పాలిత రాష్ట్రాలలో కల్తీ మద్యాన్ని విక్రయించడం లేదా అని ప్రశ్నించారు డిప్యూటీ సీఎం.
Also Read : గాయపడిన ఎంపీ శశి థరూర్