No Confidence Motion : కేంద్రంపై అవిశ్వాస తీర్మానం
ప్రవేశ పెట్టిన కాంగ్రెస్, బీఆర్ఎస్
No Confidence Motion : మణిపూర్ లో మౌనం వీడాలని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి పార్టీల సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాయి(No Confidence Motion). ఇప్పటికే మణిపూర్ అగ్నిగోళంలా మండుతోందని , కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ , బీఆర్ఎస్ ఎంపీలు.
No Confidence Motion Issue
మాతో పాటు కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టింది. పార్లమెంట్ సెషన్ ప్రారంభమైనప్పటి నుండి ప్రతి పక్షాల నేతలంతా మణిపూర్ హింసపై చర్చించాలని డిమాండ్ చేస్తూ వచ్చాయి. దేశానికి ప్రధాన మంత్రి లాంటి ఉన్నతమైన పదవిలో ఉన్న నరేంద్ర మోదీ పూర్తిగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఈ విపత్కర సమయంలో మోదీ మౌనం వీడక పోతే ఎలా అని ప్రశ్నించారు భారత రాష్ట్ర సమితి ఎంపీ నామా నాగేశ్వర్ రావు.
తాము కూడా మణిపూర్ పై సమాధానం చెప్పాలని కోరుతున్నామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలంటే కనీసం ఆయా పార్టీకి 50 సభ్యుల మద్దతు కలిగి ఉండాలి. లేక పోతే స్పీకర్ ఇందుకు ఒప్పుకోరు. బీఆర్ఎస్ పార్టీకి కేవలం 9 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఎన్డీఏ బలం 334 మంది సభ్యులు ఉండగా ప్రతిపక్షాల కూటమి ఇండియాకు 144 మంది సభ్యులే ఉండడం విశేషం.
Also Read : Zinda Banda Song : జవాన్ సాంగ్ జిందా బందా చిత్రీకరణ రూ. 15 కోట్లు