Nirmala Sitharaman : రూ. 2 వేల నోట్లపై నిర్మల కామెంట్స్
తామేమీ పెట్టవద్దని చెప్పలేదన్న మంత్రి
Nirmala Sitharaman 2000 Rs Currency : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆర్బీఐ జారీ చేసిన రూ. 2,000 నోట్లు(Nirmala Sitharaman 2000 Rs Currency) ఎక్కడా కనిపించడం లేదు. ఒక రకంగా మొదట్లో ప్రతి ఒక్కరి వద్ద రూ. 2,000 నోట్లు ఉండేవి. కానీ రాను రాను అవి కనిపించకుండా పోతున్నాయి. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో కేంద్ర విత్త మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు గాను లిఖిత పూర్వకమైన సమాధానం ఇచ్చారు నిర్మలా సీతారామన్.
మోదీ అర్ధరాత్రి నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత కేంద్ర సర్కార్ రూ. 500, రూ. 2,000, రూ. 200, రూ.100 నోట్లు విడుదల చేసింది ఆ తర్వాత రూ. 50, రూ.20 కూడా రిలీజ్ చేసింది. కానీ అక్రమార్కులకు ఒక అడ్డాగా మారి పోయింది రూ. 2,000 నోట్లు. ఎక్కడ చూసినా పట్టుబడిన వాటిల్లో రూ. 2,000, రూ. 500 నోట్లు ఉన్నాయి. దీంతో మెల మెల్లగా ఆర్బీఐ రూ. 2,000 నోట్లు ఎక్కడా ఉంచడం లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీలు లేవదీశారు.
దీనికి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి(Nirmala Sitharaman). ఆయా ఏటీఎంలలో తాము నోట్లను ఉంచమని కానీ లేదా ఉంచ వద్దని కూడా బ్యాంకులకు సూచించ లేదని స్పష్టం చేశారు. ఆయా ఏటీఎంలలో ఏయే నోట్లు ఉంచాలనేది వెండర్లకు సంబంధించిన స్వంత నిర్ణయమని పేర్కొన్నారు. ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా ఆర్బీఐ నోట్లను అందుబాటులో ఉంచుతుందని స్పష్టం చేశారు.
Also Read : కొత్త ఫ్రంట్ లో కేజ్రీవాల్ ఉంటారా