TS Govt Restricted CBI : తెలంగాణలో సీబీఐకి నో ఎంట్రీ
ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్
TS Govt Restricted CBI : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ(TS Govt Restricted CBI) కేంద్ర అవినీతి నిరోధక శాఖ (సీబీఐ ) కు నో ఎంట్రీ చెప్పింది. ఈ మేరకు జీవో కూడా జారీ చేసింది. కానీ ఈ ఏడాది ఆగస్టు నెలలో ఈ జీవోను జారీ చేసినా ఇప్పటి వరకు సీబీఐ ఎంట్రీ పై జారీ చేసిన ఉత్తర్వులకు సంబంధించి బహిరంగంగా ప్రకటించ లేదు.
ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు చర్చకు దారి తీసింది. హాట్ టాపిక్ గా మారింది. సీఎం పన్నిన కుట్రలో భాగంగా ఈ జీవోను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిందంటున్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్. ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు ప్రధానంగా వినిపించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 15 మందిని చేర్చింది సీబీఐ. ఈ తరుణంలో కవితకు చెందిన వారివి ఢిల్లీలో మద్యం దుకాణాలు కూడా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా టీఆర్ఎస్ సర్కార్ జారీ చేసిన జీవోపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. రాష్ట్రంలో సీబీఐకి అనుమతి రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తునకు నో ఎంట్రీ చెప్పింది. ఇదిలా ఉండగా గతంలో ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీబీఐకి నో ఎంట్రీ గురించి రద్దు చేసినట్లు అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు వెల్లడించారు. బీజేపీ పిటిషన్ విచారణ సమయంలో కోర్టుకు సమర్పించిన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టమైంది. ఆగస్టు 30, 2022 న జీవో 51 ఇచ్చినట్లు ఏజీ కోర్టుకు తెలిపారు.
Also Read : ప్రధాని మోదీకి గుణపాఠం తప్పదు – రాహుల్
