P Chidambaram : మోదీ సర్కార్ ఇలాఖాలో జాబ్స్ నిల్
పెరుగుతున్న ద్రవ్యోల్బణం..నిరుద్యోగం
P Chidambaram : కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, సీనియర్ నాయకుడు పి. చిదంబరం(P Chidambaram) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాలనా తీరును తీవ్రంగా తప్పు పట్టారు. అసలు ఈ దేశం ఎటు పోతుందో తెలియడం లేదని మండిపడ్డారు. అగ్నిపథ్ పేరుతో మోసం చేశారు.
కోట్లాది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఎనిమిదేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు ఇచ్చిన హామీలలో ఒక్కటన్నా నెరవేర్చిన దాఖలాలు లేవన్నారు పి. చిదంబరం. ఇదిలా ఉండగా భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీకి అద్బుతమైన స్పందన వస్తుందన్నారు.
పదే పదే నిరుద్యోగ సమస్యను ప్రస్తావిస్తూ వస్తున్నారని దీంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి, బీజేపీకి, దాని అనుబంధ సంస్థలకు కోలుకోలేని షాక్ తగిలిందన్నారు. శనివారం పి. చిదంబరం మీడియాతో మాట్లాడారు. అధికార బీజేపీపై తన పార్టీ దాడిని కొనసాగించారు. నిరుద్యోగం గురించి మోదీ ప్రభుత్వ వారసత్వంగా పేర్కొన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు(P Chidambaram).
ఉత్తర ప్రదేశ్ లో 37 లక్షల మంది గ్రేడ్ -సి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న తర్వాత 40,000 అగ్నివీర్ ఉద్యోగాలకు 35 లక్షల మంది దరఖాస్తుదారులు ఉన్నారు. రోజు రోజుకు నిరుద్యోగుల విషయంలో ఇప్పటి వరకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ఇప్పటి వరకు ప్రయత్నం చేయలేదన్నారు.
ప్రస్తుతం నిరుద్యోగం రేటు 8 శాతంగా ఉందన్నారు చిదంబరం. రోజూ వారీ సమీక్షలు చేయడం తప్ప ఇంకొకటి లేదన్నారు. ఇది ఏ రకమైన ప్రభుత్వమో ప్రజలకు తెలియ చేయాల్సిన అవసరం ఉందన్నారు పి . చిదంబరం .
Also Read : 150 మంది రైతులకు పంజాబ్ సత్కారం