Nirmala Sitharaman CBI Raids : ప్రతీకారంతో దాడులు చేయడం లేదు
ఈడీ దాడులపై నిర్మలా సీతారామన్
Nirmala Sitharaman CBI Raids : దేశ విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు కావాలని దాడులు చేస్తున్నాయంటూ పదే పదే ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడాన్నినిర్మలా(Nirmala Sitharaman CBI Raids) ఖండించారు. ఇది పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. వాస్తవాలు తెలుసుకుని కామెంట్స్ చేయాలని సూచించారు. తమ సర్కార్ ఎవరి పట్ల సపోర్ట్ గా ఉండదని ఇంకొకరి పట్ల కక్ష సాధింపు ధోరణిని ప్రదర్శించదని స్పష్టం చేశారు. సోమవారం నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు.
ఇవాళ బొగ్గు కుంభ కోణం కేసుకు సంబంధించి ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులకు కోలుకోలేని షాక్ ఇచ్చింది ఈడీ. పెద్ద ఎత్తున దాడులు, సోదాలు చేపట్టింది. ఇదిలా ఉండగా మూడు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ తరుణంలో ఈడీ దాడికి దిగడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది కాంగ్రెస్. ఇది పూర్తిగా రాజకీయంగా ఎదుర్కోలేక కేంద్రం ఆడుతున్న నాటకమని పేర్కొంది. నిప్పులు చెరిగింది.
ఈ మొత్తం ఎపిసోడ్ , వ్యవహారంపై నిర్మలా సీతారామన్ స్పందించారు. కేంద్రం కేంద్ర దర్యాప్తు సంస్థలతో జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. తమకు ఎలాంటి సంబంధం ఉండదన్నారు. ఆధారాలు లేకుండా దాడులకు దిగే ప్రసక్తి ఉండదన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి(Nirmala Sitharaman).
ఇదంతా కావాలని బద్నాం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇక నుంచి ఇలాంటి వాటికి తాము సమాధానం చెప్పాలని అనుకోవడం లేదన్నారు నిర్మలా సీతారామన్. ఏ ఏజెన్సీ అయినా ముందుగా డేటా సేకరిస్తుందన్నారు. ఆ తర్వాతే చర్యలు తీసుకుంటాయని స్పష్టం చేశారు.
Also Read : కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఈడీ దాడులు