CJI Chandrachud : శీతాకాల సెలవుల్లో ‘బెంచ్’ లు ఉండవు
స్పష్టం చేసిన ప్రధాన న్యాయూమర్తి డీవై చంద్రచూడ్
CJI Chandrachud : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్(CJI Chandrachud) సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ఈ ఏడాది 2022 శీతాకాల సెలవుల్లో సుప్రీంకోర్టుకు సంబంధించిన విచారించేందుకు గాను బెంచ్ లు అందుబాటులో ఉండవని స్పష్టం చేశారు. న్యాయ అభిమానులకు సుదీర్ఘ కోర్టు సెలవులు అంత అనుకూలం కాదనే భావన ప్రజల్లో ఉందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు రాజ్యసభలో ప్రకటన చేశారు.
ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన ప్రకటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందులో భాగంగా శీతాకాల విరామ సమయంలో డిసెంబర్ 17 నుండి జనవరి 1 వరకు సుప్రీంకోర్టు బెంచ్ అందుబాటులో ఉండదని సీజేఐ(CJI Chandrachud) స్పష్టం చేశారు. ఈ విషయాన్ని జస్టిస్ చంద్రచూడ్ శుక్రవారం వెల్లడించారు.
ఇవాళ కోర్టుకు హాజరైన న్యాయవాదులకు వెల్లడించారు. రెండు వారాల శీతాకాల విరామానికి ముందు ఇవాళే చివరి పనిదినం కానుంది. తిరిగి కొత్త సంవత్సరం 2023 జనవరి 2న అత్యున్నత న్యాయ స్థానం పునః ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్.
ఇదిలా ఉండగా కోర్టు సెలవులకు సంబంధించిన అంశం ఇంతకు ముందు కూడా లేవనెత్తారు. కాగా న్యాయమూర్తులు అంతిమ సౌఖ్యంగా ఉంటూ సెలవులను ఆనందిస్తారనే అపోహ ప్రజల్లో, నాయకుల్లో ఉందని మాజీ సీజేఐ ఎన్వీ రమణ సహా , పలువురు న్యాయూర్తులు పేర్కొన్నారు. మొత్తంగా న్యాయ శాఖ మంత్రి వర్సెస్ సీజేఐగా మారింది.
Also Read : కిరెన్’ కామెంట్స్ ‘కపిల్’ సీరియస్