Noor Ahmed : నూర్ అహ్మద్ దెబ్బకు విలవిల
చేతులెత్తేసిన రాజస్థాన్ బ్యాటర్లు
Noor Ahmed : సీన్ మారింది. గుజరాత్ టైటాన్స్ సత్తా చాటింది. బలమైన జట్టుగా పేరు పొందిన రాజస్థాన్ రాయల్స్ చేతులెత్తేసింది. ప్రత్యర్థి జట్టు బౌలర్ల దెబ్బకు విల విల లాడింది. ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ బ్యాటర్లుగా పేరు పొందిన వారంతా పెవిలియన్ కు క్యూ కట్టారు. ఒక్క రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ తప్ప ఏ ఒక్క బ్యాటర్ ఆశించిన రాణించలేక పోయారు.
స్వంత మైదానంలో ఆడిన రాజస్థాన్ రాయల్స్ అత్యల్ప స్కోర్ కే పరిమితమైంది. టాస్ గెలిచిన సంజూ శాంసన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ తన నిర్ణయం తప్పని తేలింది. గుజరాత్ టైటాన్స్ బౌలర్లు రెచ్చి పోయారు. ఆదిలోనే స్టార్ హిట్టర్ జోస్ బట్లర్ ను 2వ ఓవర్ లో బోల్తా కొట్టించారు. ఆ తర్వాత సూపర్ ఫామ్ లో ఉన్న యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ లేని పరుగు కోసం పోయి రనౌట్ అయ్యాడు. ఇక శాంసన్ ఒక్కడే 20 బంతులు ఎదుర్కొని 30 రన్స్ చేశాడు. దీంతో 17.5 ఓవర్లలో 118 పరుగులకే ఆలౌటైంది.
ఇక ఆఫ్గనిస్తాన్ బౌలర్లు రషీద్ ఖాన్ , నూర్ అహ్మద్(Noor Ahmed) చుక్కలు చూపించారు. కళ్లు చెదిరే బంతులతో బ్యాటర్లకు షాక్ ఇచ్చారు. ప్రధానంగా రషీద్ ఖాన్ బంతుల్ని ఆడలేక వికెట్లు సమర్పించుకుంటే కవ్వించి వికెట్లను తీశాడు యంగ్ బౌలర్ నూర్ అహ్మద్. ఖాన్ 3 వికెట్లు తీస్తే నూర్ అహ్మద్ 2 వికెట్లు కూల్చాడు. షమీ, పాండ్యా, లిటిల్ చెరో వికెట్ తీశారు.
Also Read : హార్దిక్ పాండ్యానా మజాకా