North East Express : పట్టాలు తప్పిన నార్త్ ఈస్ట్ ఎక్స్ ప్రెస్
బీహార్ లో చోటు చేసుకున్న ఘటన
North East Express : బీహార్ – దేశంలో వరుసగా రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడో ఒక చోట ఇవి కొనసాగుతుండడం కొంత ఆందోళన కలిగిస్తోంది. బుధవారం రాత్రి 9.35 నిమిషాల ప్రాంతంలో బీహార్(Bihar) లో నార్త్ ఈస్ట్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ పట్టాలు తప్పింది.
North East Express Train Incident
బక్సర్ సమీపంలోని రఘునాథ్ పూర్ స్టేషన్ కు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రైలు ప్రమాదంపై జిల్లా మేజిస్ట్రేట్ అన్షుల్ అగర్వాల్ మీడియాతో మాట్లాడారు. ఆయన దగ్గరుండి సహాయక చర్యలు చేపడుతున్నారు. 100 మందికి పైగా గాయపడ్డారని, 15 మందికి తీవ్రంగా గాయాలైనట్లు తెలిపారు. ఇందులో ముగ్గురి పరిస్థితి మరింత విషమంగా ఉందని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. ప్రస్తుతానికి రైలు పట్టాలు తప్పడం వల్లనే ఇది చోటు చేసుకుందని ప్రాథమిక అంచనాకు వచ్చామన్నారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తి అయిన తర్వాత ఘటనకు గల కారణాలు ఏమిటనేది తేలుతుందన్నారు డిస్ట్రిక్ మేజిస్ట్రేట్.
బాధితులను సమీప ఆస్పత్రులకు తరలిస్తున్నామని, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరుపుతున్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న దేశ ప్రధాన మంత్రి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు రైలు ఘటనపై.
Also Read : Ronald Rose : 15 జిల్లాలకు రిటర్నింగ్ ఆఫీసర్స్