Tested New Missile : మరోసారి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం
ప్రకటించిన ఉత్తర కొరియా
Tested New Missile : ఉత్తర కొరియా మరోసారి బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. శుక్రవారం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. వ్యూహాత్మక సైనిక శక్తికి కీలక సాధనంగా మారింది. సాలిడ్ ప్యూయల్ బాలిస్టిక్ క్షిపణిని(Tested New Missile) పరీక్షించినట్లు చెప్పింది. ఉత్తర కొరియా తన తాజా ఆయుధ పరీక్షను ఘన ఇంధన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అని పేర్కొంది ప్రభుత్వం.
అణు ప్రతిఘటనను నిర్వహించే సామర్థ్యంలో ఇది పెద్ద ముందడుగు అని ఉత్తర కొరియా చీఫ్ కిమ్ జోంగ్ ఉన్. ఈ విషయాన్ని ఇవాళ అధికారికంగా ప్రకటించింది. మా వ్యూహాత్మక నిరోధాన్ని పునర్ వ్యవస్థీకరిస్తుంది. అణు ఎదురు దాడి ప్రభావాన్ని మరింత బలపరుస్తుందని పేర్కొన్నారు ఉత్తర కొరియా అధ్యక్షుడు.
1,000 కిలోమీటర్లు అంటే 620 మైళ్లు ఎగిరిన ప్యోంగ్యాంగ్ ప్రాంతం నుండి ఉదయం 7.23 గంటలకు బాలిస్టిక్ క్షిపణిని(Tested New Missile) లాప్టెడ్ ట్రాజెక్టరీలో ప్రయోగించిందని సియోల్ సైన్యం వెల్లడించింది. అన్ని ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు ద్రవ- ఇంధనంతో ఉంటాయి. భూమి లేదా జలాంతర్గాముల నుండి ప్రయోగించగల ఘన ఇంధన ఐసీబీఎంలు చాలా కాలంగా కిమ్ జాబితాలో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాయి.
ఇటువంటి క్షిపణులు నిల్వ చేయడం , రవాణా చేయడం సులభం. మరింత స్థిరంగా , త్వరగా ప్రయోగానికి సిద్దం అవుతాయి. ముందస్తుగా గుర్తించి నాశనం చేయడం కష్టం. ఫిబ్రవరిలో ప్యోంగ్యాంగ్ లో జరిగిన సైనిక కవాతులో ఉత్తర కొరియా రికార్డు స్థాయిలో అణు, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను ప్రదర్శించింది.
Also Read : అసద్ ఎన్‌కౌంటర్..ఓవైసీ కామెంట్స్