Ap New Liquor Shops : ప్రైవేట్ మద్యం దుకాణలకు ఎక్సైజ్ శాఖ నొటిఫికేషన్
ప్రైవేట్ మద్యం దుకాణలకు ఎక్సైజ్ శాఖ నొటిఫికేషన్
New Liquor Shops: ఏపీ ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేస్తూ.. ప్రైవేట్ మద్యం దుకాణలకు ఎక్సైజ్ శాఖ నొటిఫికేషన్ విడుదల చెసింది. రెండేళ్ల కాల పరిమితితో నూతన మద్యం పాలసీని విడుదల చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. నోటిఫికేషన్‌లో భాగంగా నేటి నుంచి 9వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టనుంది. అక్టోబర్ 11న రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు లాటరీ తీసి లైసెన్స్‌లు ఇవ్వనుంది ఏపీ ప్రభుత్వం.
New Liquor Shops in AP
దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు ఉంటుంది. ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చే అవకాశం లేదు. అదేవిధంగా ఒకరు ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. జనాభా ప్రాతిపదికన రూ.50 లక్షల నుంచి రూ.85 లక్షల వరకు లైసెన్స్ ఫీజును నిర్ణయించింది. 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ లిక్కర్ మాల్ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఏపీ ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు.
Also Read : Siddaramaiah : సిద్ధరామయ్యకు ఈడీ బిగ్ షాక్