Nupur Bora: అస్సాం మహిళా అధికారి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, బంగారు ఆభరణాలు
అస్సాం మహిళా అధికారి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, బంగారు ఆభరణాలు
Nupur Bora : అస్సాంకు చెందిన సివిల్ సర్వీస్ అధికారిణి నుపుర్ బోరాను (Nupur Bora) పోలీసులు అరెస్టు చేశారు. భూ కుంభకోణానికి సంబంధించి ఆరోపణల నేపథ్యంలో ఆమె ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈక్రమంలో ఆమె ఇంట్లో భారీగా నోట్ల కట్టలు, బంగారుఆభరణాలు లభ్యమయ్యాయి. ముఖ్యమంత్రి ప్రత్యేక విజిలెన్స్ సెల్ అధికారుల బృందంలో నుపుర్ బోరా (Nupur Bora) పని చేస్తున్నారు. గువాహటికి చెందిన ఆమెపై భూ కుంభకోణానికి సంబంధించి ఆరోపణలు ఉన్నాయని సీఎం హిమంత బిశ్వశర్మ ఆరోపించారు. బార్పేట్ జిల్లాలో సర్కిల్ ఆఫీసర్‌గా ఉన్నప్పుడు డబ్బుకు బదులుగా భూమిని లంచంగా తీసుకున్నట్లు తేలిందన్నారు. దీంతో గత ఆరు నెలలుగా ఆమెపై నిఘా ఉంచినట్లు వెల్లడించారు.
Nupur Bora Sensational
ఈ క్రమంలోనే సోమవారం ఆమె ఇంటితో సహా మరో మూడు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సోదాల్లో రూ.90లక్షల నగదుతో పాటు రూ.కోటి విలువైన బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారన్నారు. ఆమెను అరెస్టు చేసి విచారిస్తున్నట్లు వెల్లడించారు. కాగా.. సోదాల్లో దొరికిన డబ్బుతో పాటు నుపుర్ (Nupur Bora) ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా సీఎం విజిలెన్స్ ఎస్పీ రోజీ కలిత మీడియాతో మాట్లాడుతూ… నూపుర్ బోరా ఇంట్లో రూ.92 లక్షల నగదు, రూ.2 కోట్లు విలువచేసే బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భూకుంభకోణం, ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి.ఈ కేసుపై పూర్తి దర్యాప్తు కొనసాగుతుందన్నారు. నుపుర్‌పై చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయని, దర్యాప్తులో మరిన్ని బయటపడతాయని వెల్లడించారు. కాగా.. బార్పేట్‌లో ఆమెకు సహాయకుడిగా పనిచేసిన లాట్ మండల్ సురాజిత్ డేకా నివాసంలో కూడా అధికారులు సోదాలు చేశారు. ఇతడిపై కూడా భూ కుంభకోణం ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది.
అక్రమ సెటిలర్స్ పేరున ప్రభుత్వ, సతారా భూముల అక్రమ రిజిస్ట్రేషన్లకు బోరా పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. బెంగాలీ మాట్లాడే ముస్లింలను ‘మియా’గా మిలుస్తారు. వీరిని బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన అక్రమ వలసదారులుగా బీజేపీ చెబుతోంది. ముందుగా అనుకున్న ప్రకారం బోరా నివాసంపై గత ఆదివారం రాత్రి దాడులు జరపాల్సి ఉండగా ఆమె గెస్ట్ హౌస్‌లో ఉండటంతో సోదాల్లో జాప్యం జరిగింది. గువాహటిలోని ఆమె నివాసంతో పాటు ఆమెకు సంబంధించిన మరో మూడు ప్రాంతాల్లో అధికారులు సోదాలు జరిపారు. బార్‌పేటలో అద్దెకు ఉంటున్న ఇంటిలో కూడా అధికారులు సోదాలు చేపట్టారు.
బోరాపై స్థానిక యాక్టివిస్ట్ గ్రూప్ క్రిషక్ ముక్తి సంగ్రామ్ సమితి (KMSS) లాంఛనంగా ఫిర్యాదు చేసింది. భూములకు సంబంధించిన సేవలకు ఆమె ‘రేట్ కార్డ్’ పెట్టారని, భూముల రికార్డుల్లో మార్పులు చేసేందుకు రూ.1,500 నుంచి రూ.2 లక్షల వరకూ లంచంగా తీసుకునే వారని కేఎంఎస్ఎస్ ఆరోపించింది. నూపుర్ బోరా కేవలం ఆరేళ్ల సర్వీసులోనే పెద్ద మొత్తంలో సంపద కూడబెట్టారని విజిలెన్స్ సెల్ అధికారులు తెలిపారు. కూడబెట్టిన ఆస్తులు, ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లను సోదాల్లో స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.
Also Read : Chalo Jeete Hain: బిహార్ ఎన్నికల ప్రచారంలో ‘‘ఛలో జీతే హై’’ సినిమా
