NV Ramana : సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ సంచ‌ల‌న కామెంట్స్

విచ‌క్ష‌ణా ర‌హిత అరెస్టులు..బెయిల్ పై వ్యాఖ్య

NV Ramana : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ(NV Ramana) స‌జేఐ గా కొలువు తీరినప్ప‌టి నుంచీ ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ప్ర‌ధానంగా న్యాయ వ్య‌వ‌స్థ‌లో కీల‌క మార్పులు తీసుకు వ‌చ్చారు.

ఇటీవ‌ల దేశంలో చోటు చేసుకుంటున్న అరెస్టులు, బెయిల్ ఇవ్వడంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధానంగా తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

త్వ‌ర‌, విచ‌క్ష‌ణా ర‌హిత అరెస్ట్ ల‌ను అత్య‌వ‌స‌ర స‌మ‌స్యగా మారింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

అయితే సీజేఐ ఎటువంటి నిర్దిష్ట కేసును పేర్కొనలేదు. కానీ భార‌త దేశ నేర వ్య‌వ‌స్థ‌లో ప్ర‌క్రియ గురించి ఒక శిక్ష‌గా అభివ‌ర్ణించారు జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ. ప్ర‌త్యేకంగా ఆయ‌న శాస‌న ప‌నితీరు నాణ్య‌త‌పై కూడా తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

ఈ వ్యాఖ్య‌ల‌లో ఇటీవ‌ల చోటు చేసుకుంటున్న సంఘ‌ట‌న‌లు భారీ ప్రాముఖ్య‌త‌ను సంత‌రించుకున్నాయి. ఇటీవ‌లి వారాల్లో ఢిల్లీ, ఉత్త‌ర ప్ర‌దేశ్ లో పోలీసుల‌తో వాస్త‌వ త‌నిఖీ వెబ్ సైట్ ఆల్ట్ న్యూస్ కో ఫౌండ‌ర్ మ‌హ్మ‌ద్ జుబైర్ , మహారాష్ట్ర‌లో న‌టుడు కేత‌కి చితాలే అరెస్ట్ ల‌పై నిరంత‌రం ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.

జుబైర్ గ‌త నెలాఖ‌రు నుండి 2018 ట్వీట్ పై అరెస్ట్ లో ఉన్నారు. తాజాగా ఢిల్లీ కోర్టు బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా రూ. 50,000 పూచీ క‌త్తుతో

బెయిల్ మంజూరు చేసింది. ఇక ప్ర‌ముఖ న‌టి కేత‌కి చితాలే విష‌యంలో ఇదే జ‌రిగింది.

ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ పై నిప్పులు చెరిగింది. దీంతో కేత‌కిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మొత్తం

ఘ‌ట‌న‌లన్నీ భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్చ‌కు భంగం క‌లిగిస్తున్నాయ‌నే ఆరోప‌ణ‌లున్నాయి.

జైపూర్ లో కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు , సుప్రీంకోర్టు సీనియ‌ర్ న్యాయమూర్తుల స‌మ‌క్షంలో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన

న్యాయ‌మూర్తి ఎన్వీ ర‌మ‌ణ(NV Ramana) ఎటువంటి నిర్దిష్ట కేసును పేర్కొనలేదు. కానీ కేంద్రంపై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

Also Read : అస్సాంలో 672 కొత్త COVID-19 కేసులు

Leave A Reply

Your Email Id will not be published!