Odisha Train Accident : పెరిగిన మృతుల సంఖ్య
288కి చేరిన మృతులు 1000కి పైగా బాధితులు
Odisha Train Accident : ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ లో చోటు చేసుకున్న కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొన్న ఘటనలో(Odisha Train Accident) మృతుల సంఖ్య పెరుగుతోంది. మొదటగా 233గా ప్రకటించిన రైల్వే శాఖ ఉన్నట్టుండి 288కి పెరిగినట్లు వెల్లడించింది. ఈ ఘటనలో గాయపడిన వారి సంఖ్య కూడా పెరిగింది. మొదట 900గా ఉండగా ఆ సంఖ్య 1,000ని దాటేసింది. రైలు దుర్ఘటనలో మరిన్ని మృతుల సంఖ్య పెరగవచ్చని అంచనా. సాయంత్రం అయితే కానీ పూర్తి స్థాయిలో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో, ఎంత మంది గాయపడ్డారనేది తేలుతుంది.
ఓ వైపు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. క్షతగాత్రులను, బాధితులను బాలాసోర్ జిల్లాలోని సమీప ప్రాంతాల్లో ఉన్న ఆస్పత్రులకు తరలించారు. మరికొందరిని రాష్ట్ర రాజధానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. తన జీవితంలో ఇలాంటి దుర్ఘటన ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఒడిశా ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ సుధాన్ష్ సారంగి.
ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మృతులకు, బాధితులకు ఆర్థిక సహాయం ప్రకటించాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఒడిశా రైలు దుర్ఘటనపై. చని పోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 2 లక్షలు, గాయపడిన వారిలో ఒక్కొక్కరికి రూ. 50 వేలు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇతర రాష్ట్రాల సీఎంలు సైతం సహాయం చేసేందుకు ముందుకు వచ్చాయి.
Also Read : Odisha Train Incident