#Ola : లండన్‌లో ఓలా పరుగులు
ఊబెర్ తో ఓలా పోటీ
Ola : ఇండియాలో ఇప్పటికే తనకంటూ ఓ ఇమేజ్ను ఏర్పాటు చేసుకున్న ఓలా స్టార్టప్ కంపెనీ తన సేవలను ఇతర దేశాలకు విస్తరించింది. టెక్నాలజీ సాయంతో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేసేందుకు వీలు కలుగుతుంది. దీంతో వెహికిల్స్ కోసం ఎదురు చూడాల్సిన పనిలేదు. జస్ట్ ఓలా యాప్(Ola )ను స్మార్ట్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుంటే చాలు.
మీరుంటున్న స్థానం నుంచి గమ్య స్థానం వెళ్లేంత దాకా సురక్షితంగా నగరంలో ఎక్కడికైనా జర్నీ చేసేందుకు వీలు కల్పిస్తుంది. రెంట్ , కమీషన్ ఆధారంగా వీటిని నడుపుతారు. ఓలా మొదటగా స్టార్టప్‌గా ప్రారంభమైంది. ఆ తర్వాత కోట్లాది రూపాయలు వివిధ కంపెనీలు ఈ కంపెనీలో పెట్టుబడిగా పెట్టాయి.
ఓలా కంపెనీ లండన్‌లో ప్రవేశించింది. అక్కడ వెహికిల్స్ నడిపించాలంటే గ్రీన్ లైట్ ఉండాల్సిందే. ఇందు కోసం యుకెలో తాము టాక్సీలు నడిపేందుకు 2018 ఆగస్టులో దరఖాస్తు చేసుకుంది ఓలా. ఇంగ్లండ్‌తో పాటు ఆస్ట్రేలియాలో ఓలా తన అద్దె వెహికిల్స్ సర్వీసెస్‌ను స్టార్ట్ చేసింది. భారతదేశంలో రైడ్ హెయిలింగ్ ప్లాట్ ఫాం ఓలా క్యాబ్స్(Ola )ప్రథమ స్థానంలో ఉంది.
ఏఎన్ఐ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సాయంతో ట్యాక్సీలను నడుపుతోంది ఓలా. పూర్తి రక్షణాత్మకంగా, అన్ని సౌకర్యాలను కల్పిస్తూ..సురక్షితంగా ప్రయాణికులను చేర వేసేందుకు ఓలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ప్రైవేట్ హైర్ వెహికిల్స్ నడిపించేందుకు యుకె సర్కార్ ఓలాకు పర్మిషన్ శాంక్షన్ చేసింది. ఓలా ఇపుడు ఊబెర్ టెక్నాలజీస్ ఇంక్‌తో పోటో పడుతోంది.
ఇటీవల జపాన్‌కు చెందిన సాఫ్ట్ బ్యాంక్ ఓలా విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసేందుకు 220 మిలియన్లకు పైగా ఇందులో ఇన్వెస్ట్ చేసింది. ఈ భారీ నిధుల వల్ల తమ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ఓలా ప్రయత్నాలు చేస్తోంది. ఇండియాలోని ప్రతి నగరంతో పాటు ఇతర దేశాలలో కూడా వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు తయారు చేస్తోంది.
ఇందు కోసం నిపుణుల కమిటీ కూడా ఏర్పాటు చేసింది కంపెనీ. లండన్‌లోని స్థానిక ప్రభుత్వం నుండి ట్రాన్స్ పోర్ట్ ఫర్ లండన్ నుంచి లైసెన్స్ కూడా పొందింది ఓలా. ఓలా యుకె ప్రైవేట్ లిమిటెడ్(Ola )కంపెనీ ఏడాది పాటు క్యారేజ్ లైసెన్స్ తీసుకుంది. ఇందు కోసం ప్రత్యేకంగా డ్రైవర్లు రిజిష్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
వీరికి అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఓలా తన ట్యాక్సీలకు ఉపయోగించుకుంటుంది. ఆ దేశపు నియమ నిబంధనలకు అనుగుణంగా ఓలా తన కార్యకలాపాలను నిర్వహించనుంది. మొత్తం మీద ఓ భారతీయ అంకుర సంస్థ ..అతి పెద్ద ట్యాక్సీ వెహికిల్స్ రంగంలో విదేశాలకు విస్తరించడం విశేషం కదూ.
No comment allowed please