Omar Abdullah Rahul Yatra : రాహుల్ యాత్రలో ఒమర్ అబ్దుల్లా
అడుగులో అడుగు వేసిన మాజీ సీఎం
Omar Abdullah Rahul Yatra : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా చేరారు. జమ్మూ లో ఇప్పటి దాకా కొనసాగిన పాదయాత్ర శుక్రవారం కాశ్మీర్ లోని బనిహాల్ లోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీతో జత కట్టారు.
ఆయనతో పాటు అడుగులో అడుగు వేశారు. ఈ సందర్బంగా ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah) మీడియాతో మాట్లాడారు. దేశం కోసం తాను కూడా రాహుల్ గాంధీతో జతకట్టానని చెప్పారు. దేశ పరిస్థితి, వాతావరణం, జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడంపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని తాను లోతుగా పరిశోధించడం లేదన్నారు ఒమర్ అబ్దుల్లా.
భారత్ జోడో యాత్ర ఒక్కరి కోసం కొనసాగిస్తున్నది కాదు. అది దేశంలో ప్రతి ఒక్కరు బాగుండాలని కొనసాగిస్తున్న యాత్రగా పేర్కొన్నారు ఒమర్ అబ్దుల్లా. దేశ ప్రతిష్ట గురించి మరింత ఆందోళన చెందుతున్నందున తాను భారత్ జోడో యాత్రలో చేరినట్లు చెప్పారు . ఒకరి ఇమేజ్ కోసం చేరలేదని కేవలం దేశం కోసం కొనసాగుతున్న ఈ మహత్తర కార్యక్రమం కోసం చేరినట్లు తెలిపారు ఒమర్ అబ్దుల్లా.
ఇప్పటి వరకు రాహుల్ గాంధీ చేపట్టిన యాత్ర 3,500 కిలోమీటర్లకు పైగా పూర్తయింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అరబ్ దేశాలతో స్నేహం చేస్తుందని, కానీ మైనార్టీ వర్గానికి సంబంధించి ఒక్కరికి కూడా ప్రాతినిధ్యం కల్పించలేదని ఆరోపించారు ఒమర్ అబ్దుల్లా(Omar Abdullah). ఈనెల 30తో యాత్ర ముగస్తుంది. 31న భారీ బహిరంగ సభతో పూర్తవుతుంది యాత్ర.
Also Read : ఢిల్లీ మేయర్ ఎన్నికపై ఆప్ కోర్టుకు