PM Modi : ఒకే దేశం ఒకే పోలీస్ ఒకే యూనిఫాం – మోదీ

త్వ‌ర‌లో దేశ వ్యాప్తంగా అమ‌లు చేస్తాం

PM Modi : దేశ వ్యాప్తంగా ఒకే దేశం ఒకే పోలీసు ఒకే యూనిఫాంను త్వ‌ర‌లో దేశ వ్యాప్తంగా అమ‌లు చేస్తామ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ. రాష్ట్ర హొం మంత్రుల చింత‌న్ శివిర్ లో ప్ర‌ధాని పాల్గొని ప్ర‌సంగించారు. దేశ‌మంత‌టా ఉన్న పోలీసుల గుర్తింపు ఒకేలా ఎందుకు ఉండ కూడ‌ద‌ని ప్ర‌శ్నించారు.

ఎవ‌రైనా పోలీసు లేదా ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌లో భాగ‌మైన‌ప్పుడు వేర్వేరుగా హోదాలు, యూనిఫాంలు ఉండాల‌ని అన్నారు ప్ర‌ధాన‌మంత్రి. ఇక నుంచి శాశ్వ‌త విముక్తి ల‌భించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. పోలీసులు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించు కోవాల‌ని ప్ర‌ధాన‌మంత్రి సూచించారు.

వివిధ శ‌క్తుల మ‌ధ్య ఏక‌రూప‌త ఉండేలా పోలీసుల‌కు ఒకే దేశం ఒకే యూనిఫాం అనే ఆలోచ‌న‌ను న‌రేంద్ర మోదీ(PM Modi)  శుక్ర‌వారం ప్ర‌తిపాదించారు. ఇది కేవ‌లం ఒక ఆలోచ‌న మ‌త్ర‌మేన‌ని అది విధించ‌డం కాద‌న్నారు. దీనిని ఒక సూచ‌న‌గా మాత్ర‌మే ఆలోచించాల‌ని ప్ర‌ధాన‌మం్త‌రి కోరారు.

ఈ ప్ర‌తిపాద‌న ఐదు , 50 లేదా 100 సంవ‌త్స‌రాల‌లో జ‌ర‌గ‌వ‌చ్చ‌ని అన్నారు మోదీ. కాగా ఆలోచించ‌డంలో ఎలాంటి త‌ప్పు లేదు క‌దా అని పేర్కొన్నారు. నేరాలు, నేర‌స్థుల‌ను ఎదుర్కోవ‌డానికి రాష్ట్రాల మ‌ధ్య స‌న్నిహిత స‌హ‌కారాన్ని క‌లిగి ఉండాల‌ని ప్ర‌ధాన మంత్రి కోరారు.

శాంతి భ‌ద్ర‌త‌ల పాల‌సీ కోసం కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా చేసిన పిలుపును కూడా మోదీ స‌మ‌ర్థించారు. కోఆప‌రేటివ్ ఫెడ‌రిలిజం అనేది రాజ్యాంగ భావ‌న మాత్ర‌మే కాదు.

అంత‌ర్గ‌త భ‌ద్ర‌త కోసం రాష్ట్రాలు క‌లిసి ప‌ని చేయ‌డం రాజ్యాంగ ఆదేశంతో పాటు దేశం ప‌ట్ల బాధ్య‌త అని పేర్కొన్నారు ప్ర‌ధాన‌మంత్రి.

Also Read : 2024 నాటికి అన్ని రాష్ట్రాల్లో ఎన్ఐఏ శాఖ‌లు

Leave A Reply

Your Email Id will not be published!