Arvind Kejriwal : గుజ‌రాత్ లో కాంగ్రెస్ కు వ‌చ్చేవి 5 సీట్లే

ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అర‌వింద్ కేజ్రీవాల్

Arvind Kejriwal : గుజ‌రాత్ లో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల కావ‌డంతో రాజ‌కీయ పార్టీలు ప్ర‌చారంలో మునిగి పోయాయి. బీజేపీ మ‌రోసారి ప‌వ‌ర్ లోకి వ‌చ్చేందుకు ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరొందిన అమిత్ షా మొత్తంగా తానై ఫోక‌స్ పెట్టారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి త‌న స‌త్తా చాటాల‌ని చూస్తోంది.

ఇప్ప‌టికే ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ ద్వారా త‌మ పార్టీ అభ్య‌ర్థి మాజీ మీడియా కింగ్ పిన్ గా ఉన్న సుదాన్ గాధ్వీని ప్ర‌క‌టించింది. ఇక ఈసారి ఎన్నిక‌ల‌ను అన్ని పార్టీలు సీరియ‌స్ గా తీసుకున్నాయి. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ త‌గిలింది. ఎన్నిక‌ల వేళ ఆ పార్టీకి చెందిన జాతీయ కార్య‌ద‌ర్శి, కీల‌క నాయ‌కుడిగా ఉన్న హిమాన్షు వ్యాస్ రాజీనామా చేశారు.

ఆయ‌న వెళుతూ వెళుతూ ఆ పార్టీపై నిప్పులు చెరిగారు. పార్టీలో ప్ర‌జాస్వామ్యం అన్న‌ది లేకుండా పోయింద‌న్నారు. ఈ దేశంలో ప్ర‌ధాని మోదీని క‌లిసేందుకు వీలు కుదురుతుంద‌ని కానీ రాహుల్ ను క‌ల‌వాలంటే చాలా టైం ప‌డుతుంద‌న్నారు. ఈ త‌రుణంలో ఆప్ చీఫ్‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ప్ర‌స్తుతం జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి క‌నీసం 5 సీట్లు వ‌స్తే క‌ష్ట‌మ‌న్నాడు. తాము అన్ని పార్టీల కంటే ముందంజ‌లో ఉన్నామ‌న్నారు. 27 ఏళ్లుగా పాలిస్తున్న భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం ఈ రాష్ట్రానికి చేసింది ఏమీ లేద‌న్నారు కేజ్రీవాల్(Arvind Kejriwal) . కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేద‌న్నారు.

జ‌నం మార్పును కోరుతున్నార‌ని ఆ మార్పు ఒక్క ఆప్ ద్వారా సాధ్య‌మ‌వుతుంద‌న్నారు కేజ్రీవాల్.

Also Read : ఆర్ఎస్ఎస్బీ చీఫ్ ధిల్లాన్ తో మోదీ భేటి

Leave A Reply

Your Email Id will not be published!