Telangana High Court : ఆప‌రేష‌న్ లోట‌స్ నిందితులు క‌స్ట‌డీకి

లంచం ఇచ్చేందుకు ప్ర‌య‌త్నం

Telangana High Court : తెలంగాణ‌లో న‌లుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్య‌వ‌హారంలో కీల‌కంగా ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. కాగా సీబీఐ కోర్టు వారిని విడుద‌ల చేయాలంటూ ఆదేశించింది. వారికి సంబంధించిన కీల‌క ప‌త్రాల‌ను స‌మ‌ర్పించ‌క పోవ‌డాన్ని త‌ప్పు ప‌ట్టింది. దీనిని స‌వాల్ చేస్తూ పోలీసులు నిందితుల‌ను క‌స్ట‌డీకి ఇవ్వాలంటూ రాష్ట్ర హైకోర్టును(Telangana High Court) ఆ్ర‌శ‌యించారు.

ఇవాళ విచార‌ణ చేప‌ట్టిన ధ‌ర్మాస‌నం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఎమ్మెల్యే కొనుగోలు వ్య‌వ‌హారంలో అస‌లు ప‌ట్టుబ‌డిన న‌గ‌దు ఎంత‌, స్వాధీనం చేసుకున్న డ‌బ్బుల‌కు సంబంధించి ఏవైనా వివ‌రాలు ఉన్నాయా. స్వంతంగా సంపాదించారా లేకా ఎవ‌రైనా ఇచ్చారా..

అస‌లు సైబ‌రాబాద్ క‌మిష‌న‌ర్ స్టీఫెన్ ర‌వీంద్ర చెప్పిన‌ట్లు రూ. 100 కోట్ల డీల్ కుదుర్చుకుంటే దాని వివ‌రాలు ఎందుకు స‌మ‌ర్పించ లేదంటూ ప్ర‌శ్నించింది కోర్టు. ఎట్ట‌కేల‌కు హైకోర్టు ధ‌ర్మాస‌నం విచార‌ణ నిమిత్తం ఆ ముగ్గురు నిందితుల‌ను క‌స్ట‌డీలోకి తీసుకునేందుకు ప‌ర్మిష‌న్ ఇచ్చింది.

ఇదిలా ఉండ‌గా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ నేత‌లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీనిని ఆప‌రేష‌న్ లోట‌స్ గా పేర్కొన్నారు. ఎమ్మెల్యేల‌కు లంచం ఇచ్చేందుకు ప్ర‌య‌త్నించిన ఆ ముగ్గురిని రాష్ట్రంలో గులాబీ స‌ర్కార్ ను కూల్చేందుకే కుట్ర‌కు తెర తీశారంటూ ఆరోపించారు.

ఇదిలా ఉండ‌గా సాక్ష్యాధారాలు లేవ‌ని పేర్కొంటూ నిందితుల‌ను వారెంట్ లేకుండానే పోలీసులు అరెస్ట్ చేసేందుకు అనుమ‌తించే సెక్ష‌న్ 41 కింద నోటీసులు జారీ చేసింది. దీనిని ఆధారంగా చేసుకుని బీజేపీతో సంబంధం ఉన్న నిందితుల‌ను ప్ర‌శ్నించాల‌ని పోలీసుల‌ను కోరింది.

మొత్తంగా ఈ వ్య‌వ‌హారం అటు బీజేపీకి ఇటు టీఆర్ఎస్ కు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది.

Also Read : ద‌మ్ముంటే సీబీఐతో విచార‌ణ చేప‌ట్టండి

Leave A Reply

Your Email Id will not be published!