Opposition Partys PM : ద‌ర్యాప్తు సంస్థ‌ల‌పై పీఎంకు లేఖ‌

దుర్వినియోగం చేస్తున్నారంటూ ఆరోప‌ణ

Opposition Party’s Letter : దేశంలో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లు ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని, చ‌ట్టానికి లోబ‌డి ప‌ని చేయ‌డం లేదంటూ దేశంలోని ఎనిమిది ప్ర‌తిప‌క్ష పార్టీలు మండిప‌డ్డాయి. ఈ మేర‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి సుదీర్ఘ లేఖ(Opposition Party’s Letter)  రాశాయి.

విచిత్రం ఏమిటంటే ఇందులో కాంగ్రెస్ పార్టీ లేక పోవ‌డం విస్తు పోయేలా చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ అగ్ర నాయ‌కుడు, ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియాను లిక్క‌ర్ స్కాం కేసులో ఇప్ప‌టికే అరెస్ట్ చేసింది సీబీఐ. దీనిపై భ‌గ్గుమ‌న్నాయి విప‌క్షాలు. ఆయా పార్టీలకు చెందిన అగ్ర నాయ‌కులు ఈ లేఖ రాయ‌డం విశేషం.

పీఎంకు లేఖ రాసిన వారిలో తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఉన్నారు. ఈ లేఖ‌కు కాంగ్రెస్ దూరంగా ఉంది. నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ కు చెందిన ఫ‌రూక్ అబ్దుల్లా, నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ , శివ‌సేన పార్టీ చీఫ్ ఉద్ద‌వ్ ఠాక్రే , స‌మాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ , బీహార్ డిప్యూటీ సీఎం తేజ‌స్వి యాద‌వ్ ఈ లేఖ‌పై సంత‌కం చేసిన వారిలో ఉన్నారు.

కానీ ఎక్క‌డా కాంగ్రెస్ పార్టీ సంత‌కం చేయ‌లేదు. ఇక ఈ లేఖ‌లో భార‌త దేశం ఇప్ప‌టికీ ప్ర‌జాస్వామ్య దేశ‌మ‌ని మీరు అంగీక‌రిస్తార‌ని తాము న‌మ్ముతున్నాము. ప్ర‌తిప‌క్ష స‌భ్యుల‌పై కేంద్ర ఏజెన్సీల‌ను దుర్వినియోగం చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాదు. ఇది ప్ర‌జాస్వామ్య‌మ‌ని అనిపించుకోదు..ఇది నిరంకుశ‌త్వానికి, రాచ‌రికానికి మార్గంగా అనిపిస్తోందంటూ ప్ర‌తిప‌క్షాల నేత‌లు(Opposition Party’s Letter) పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేక పోయినా మ‌నీష్ సిసోడియాను అరెస్ట్ చేశారంటూ ఆర‌పించారు.

Also Read : పేద‌రికం పేరుతో రాజ‌కీయం చేశారు

Leave A Reply

Your Email Id will not be published!