Oracle Lay Offs : ఒరాకిల్ షాక్ 3 వేల మందికి ఝ‌ల‌క్

ఆర్థిక మాంద్యం దెబ్బ‌కు ఉద్యోగులు విల‌విల

Oracle Lay Offs : దిగ్గ‌జ కంపెనీలు దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాయి. ఇప్ప‌టికే వేలాది మందిని సాగ‌నంపింది. టెస్లా చైర్మ‌న్ , ట్విట్ట‌ర్ బాస్ ఎలాన్ మ‌స్క్ ముందుగా ఉద్యోగుల‌ను తొల‌గించే ప్ర‌క్రియ‌కు శ్రీ‌కారం చుట్టాడు. ఆ త‌ర్వాత గూగుల్ , మైక్రో సాఫ్ట్, ఫేస్ బుక్, అమెజాన్ , త‌దిత‌ర దిగ్గ‌జ కంపెనీల‌న్నీ ఉద్యోగుల‌ను సాగ‌నంపాయి.

మ‌రో వైపు టెక్నాల‌జీలో కీల‌క మార్పులు చోటు చేసుకోవ‌డం వ‌ల్ల జాబ‌ర్స్ ను తొల‌గిస్తున్నాయి. తాజాగా మ‌రో టెక్ దిగ్గ‌జం ఒరాకిల్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఏకంగా 3,000 వేల మందికి పైగా తొల‌గించింది. దీని దెబ్బ‌కు ఉద్యోగులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో తెలియ‌క బిక్కు బిక్కు మంటున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు కంపెనీలు 3 ల‌క్ష‌ల మంది ఉద్యోగుల‌ను సాగ‌నంపాయి. క్లౌడ్ మేజ‌ర్ ఒరాకిల్ 28.4 డాల‌ర్ల‌తో కొనుగోలు చేసిన ఎల‌క్ట్రానిక్ హెల్త్ కేర్ రికార్డ‌స్ సంస్థ సెర్న‌ర్ లో భారీ ఎత్తున ఉద్యోగుల‌ను తొలగించింది. ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండానే బ‌య‌ట‌కు పంప‌డంపై మండిప‌డుతున్నారు.

ఒరాకిల్ అనుబంధ సంస్థ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 23 వేల మందికి పైగా ప‌ని చేస్తున్నారు. ఇందులో ప్ర‌ధానంగా మార్కెటింగ్ , ఇంజ‌నీరింగ్ , అకౌంటింగ్ , లీగ‌ల్ , ప్రొడ‌క్ట్ ల‌తో స‌హా ఇత‌ర విభాగాల‌లో ఉద్యోగుల‌ను తొల‌గించింది.

Also Read : Aditi Tiwari

Leave A Reply

Your Email Id will not be published!