Elephant Whisperes : ది ఎలిఫెంట్ విస్పరర్స్ కు ఆస్కార్
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ కు గౌరవం
Elephant Whisperes : అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వేదికగా ఆస్కార్ 2023 అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. భారత దేశానికి చెందిన ది ఎలిఫెంట్ విస్పరర్స్(Elephant Whisperes) ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ ను గెలుచుకుంది. కార్తీకి గోన్సాల్వేస్ దర్శకత్వం వహించగా , గునీత్ మోంగా నిర్మించారు ఈ షార్ట్ ఫిలింను . 95వ అకాడమీ అవార్డ్స్ లో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ ను గెలుచుకుంది.
కేటగిరీలోని ఇతర నలుగురు నామినీలు హాలౌట్ , ది మార్చా మిచెల్ ఎఫెక్ట్ , స్ట్రేంజర్ ఎట్ ది గేట్ , హౌ డు యు మెజర్ ఏ ఇయర్ ది హౌస్ దట్ ఆనంద బిల్డ్ , యాన్ ఎన్ కౌంటర్ విత్ ఫేసెస్ వరుసగా 1969, 1979లో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ కి పోటీ పడ్డాయి.
ముదుమలై నేషనల్ పార్క్ లో సెట్ చేసిన ఎలిఫెంట్ విస్పరర్స్ బొమ్మన్ , బెల్లి అనే దేశీయ దంపతుల సంరక్షణలో రఘు అనే అనాధ ఏనుగు పిల్ల కథ. డాక్యుమెంటరీ వారి మధ్య ఏర్పడే దేశీయ దంపతుల మధ్య ఏర్పడే బంధాన్ని మాత్రమే కాకుండా వారి పరిసరాల సహజ సౌందర్యాన్ని కూడా ఇందులో హృద్యంగా చూపించారు. ఎలిఫెంట్ విస్పరర్స్ డిసెంబర్ 2022లో నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది.
ఇక భారత దేశం నుంచి ది ఎలిఫెంట్ విస్పరర్స్ తో పాటు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ నుండి ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయిన నాటు నాటు ఉత్తమ ఒరిజనల్ సాంగ్ గా నామినేట్ అయ్యింది. చిత్ర నిర్మాత షౌనక్ సేన్ ఆల్ దట్ బ్రీత్స్ ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో నామినేట్ చేయబడింది.
Also Read : సినీ లోకంపై తెలుగు పాట సంతకం