#ChinnaJeeyar : మ‌న‌సే మందిరం దేహ‌మే దేవాల‌యం

అసంతృప్తిని ఎట్టి ప‌రిస్థితుల్లోను ద‌రి చేర‌ నీయ‌కండి

Chinna Jeeyar  : ప‌రుగులు తీసే ప్ర‌వాహానికి అడ్డుప‌డాల‌ని అనుకుంటారా ఎవ‌రైనా. జెట్ స్పీడ్ కంటే వేగంగా ప‌రుగులు తీస్తున్న‌కాలాన్ని ఎవ‌రైనా ఒడిసి ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశారా. ప్ర‌తి ఒక్క‌రికి విజ‌యం సాధించాల‌న్న త‌ప‌న ..కుతూహ‌లం ఎక్కువ‌గా వుంటుంది. మార్కెట్లో రోజూ వారీగా దొరికే వ‌స్తువా స‌క్సెస్ సాధించ‌డం అంటే. ఒక బ‌ల‌మైన కార‌ణం వుండాలి. మ‌నిషిగా ఎద‌గాలంటే. ఓ స్ప‌ష్ట‌మైన ప్ర‌ణాళిక రూపొందించు కోవాలి. అందు కోసం ఏమేం చేస్తే ల‌క్ష్యం చేరుకోగ‌లోమో ముందే బ‌లాలు, బ‌ల‌హీన‌త‌ల‌ను బేరీజు వేసుకోగ‌ల‌గాలి.

అప్పుడే మ‌న‌మేమిటో మ‌న స‌త్తా ఏమిటో తెలుస్తుంది. ఇదంతా అలుపెరుగ‌కుండా ప్ర‌య‌త్నం చేస్తే వ‌చ్చే ఫ‌లితం . చెట్టు అనే వ్య‌క్తిత్వ‌పు ఫ‌లాల‌ను అందుకోవాలంటే విత్త‌నం బ‌ల‌మైన‌దై ఉండాలి. మ‌న‌సు పాద‌రసం లాంటిది. అది ఒక‌చోట కుదురుగా ఉండ‌దు. ఎక్క‌డా ఏకాగ్ర‌త‌తో నిలుచోనీయ‌దు. ప‌రిప‌రివిధాలుగా ప‌రిభ్ర‌మిస్తూనే వుంటుంది. ఒక్కోసారి ఈ ప్ర‌పంచాన్ని జ‌యించినంత ఆనందం క‌లుగుతుంది. ఇంకోసారి ఎవ‌రికీ అందుబాటులో లేకుండా ఎక్క‌డికో వెళ్లిపోతాం. ఇపుడంతా ఇదే ఫ్యాష‌న్‌.అయిపోయింది.

ఒక బ‌ల‌మైన పునాదులు క‌లిగిన వ్య‌వ‌స్థ త‌యారు కావాలంటే అంత‌కంటే ఉక్కు సంక‌ల్పం క‌లిగిన మ‌నుషుల స‌మూహం రెడీగా ఉండాలి. అపుడే అనుకున్న‌ది మ‌న‌ద‌వుతుంది. ఇది ఊరికే ల‌భిస్తుందా కాదు క‌ష్ట‌ప‌డాలి. ఒక్కోసారి చిక్కిన‌ట్టే చిక్కి మాయ‌మై పోతుంది. ఎలాంటి ట్రైనింగ్ లేకుండానే ప‌క్షులు అనుకున్న చోటికి ఎగుర‌గ‌ల‌వు. ఎక్క‌డ ఆహారం ల‌భిస్తే అక్క‌డికి చేర‌గ‌ల‌వు. ఇదంతా ఎలా సాధ్య‌మైంది…అంతా రెప్ప‌పాటులో ఆక‌లిని తీర్చుకోవాలంటే ప్ర‌యాణం చేయాల్సిందే.

ఎంత దూర‌మైనా స‌రే వెళ్లాల్సిందే. అలాంటిదే మ‌నం కూడా. శ‌రీరం..మ‌న‌సు ఒక‌దానికొక‌టి అల్లుకుని ఉంటాయి. ఒక‌దానిపై మ‌రొక‌టి ఆధార‌ప‌డి ఉంటాయి. వీటిలో ఏ ఒక్క‌టిలో తేడా వ‌చ్చినా ఇక అపజ‌యం మూట‌గ‌ట్ట‌కున్న‌ట్లే..అసంతృప్తిని ఎట్టి ప‌రిస్థితుల్లోను ద‌రి చేర‌నీయ‌కండి. పాజిటివ్ ఫీలింగ్స్ ను క‌లిగి ఉండండి. ఇపుడు కాక‌పోయినా స‌రే రేప‌టికి మంచి పౌరులుగా త‌యార‌య్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. మ‌న‌సే అన్నింటికి మూలం..కేంద్రం కూడా..దేహ‌మే దేవాల‌యం. దానిని అలా భావించు కోగ‌లిగితే ఎంతో మేలు జ‌రుగుతుంది.

No comment allowed please