#ChinnaJeeyar : భ‌క్తులారా ప్రేమించండి ప్రేమ‌ను పంచండి

క‌నీసం 5 శాతాన్ని స‌మాజ హితం కోసం ఖ‌ర్చుచేయాలి

Chinna Jeeyar : అన్ని జీవుల్లో కెల్లా మాన‌వ జీవితం గొప్ప‌ది. పుట్టుక మ‌న చేతుల్లో లేదు. పోయేది మాత్రం మ‌న చేతుల్లోనే ఉంది. పోయే లోపు మ‌నం చేసిన ప్ర‌యాణం ఎలాంటిదో తెలియాలంటే బ‌తుకును మ‌రింత క‌ట్టుదిట్టంగా రూపొందించు కోగ‌ల‌గాలి. అప్పుడే సంసారంలో క‌ల‌త‌లు అంటూ ఉండ‌వు. ఎక్క‌డికైనా వెళ్లాలంటే వాహ‌నాలు కావాలి. ఏదైనా సాధించాలంటే దానికి త‌గ్గ‌ట్టు రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మించాలి. స‌ర్వాంత‌ర్యామి అయిన ఆ భ‌గ‌వంతుడిని స్మ‌రించు కోవాలంటే ముందు మ‌నం ఆత్మ‌ను..మ‌న‌సును మ‌లినాలు అంట‌కుంటా ప‌రిశుభ్రంగా ఉంచు కోవాలి.

దీనిని పొందాలంటే ఎంతో క‌ష్ట‌ప‌డాలి. దీనిని చేయాలంటే ఏం చేయాలి..త‌నివి తీరా ప్రేమించాలి. అపుడే ఇంకొంద‌రికి ప్రేమ‌ను పంచ‌గ‌లం. ఆ దైవం కూడా సమాజ హితం కోరే మ‌నుషుల్నే కోరుకుంటుంది. సాటి వారిని..తోటి వారి ప‌ట్ల స‌హృద‌య‌త క‌లిగి ఉండేలా చేస్తుంది. అంతులేని స్వార్థం..ఎక్క‌డ లేని ఈర్ష్యా ద్వేషాలు మ‌నుషుల్ని దూరం ఉంచేలా చేస్తున్నాయి.

ఎవ‌రికి వారు అధికుల‌మ‌ని..త‌మ‌కంటే గొప్ప‌వారు లేర‌ని అనుకుంటున్నారు. కాల‌పు ప్ర‌వాహంలో అంతా నిమిత్త‌మాత్రులేన‌న్న నిజాన్ని గ్ర‌హించాలి. రోజూ వారీ సంపాద‌న‌లో క‌నీసం 5 శాతాన్ని స‌మాజ హితం కోసం ఖ‌ర్చుచేయాలి. ఇది ప్రేమించ‌డం వ‌ల్ల సాధ్య‌మ‌వుతుంది. ఎవ‌రికి వారు ఎవ‌రి లోకంలో వారుంటే స‌మాజం ఎలా అభివృద్ధి సాధిస్తుంది.

అంతా స‌మానులేన‌న్న భావ‌న రావాల‌న్నా..స‌ర్వ ప్రాణులకు సేవ చేయాల‌న్న ప్రేమ క‌లిగి ఉండాలి. అదే మ‌నుషుల‌ను గొప్ప‌వారిగా త‌యారు చేసేలా దోహ‌ద ప‌డుతుంది. అన్నింటికి రుసుములు చెల్లించాలి..ఉద‌యం లేచి న‌ప్ప‌టి నుంచి రాత్రి ప‌డుకునే దాకా ..
మ‌నం బ‌త‌కాలంటే చ‌చ్చేంత దాకా ఈ లోకానికి బాకీ తీరుస్తూనే ఉండాలి. మ‌రి ఇంత గొప్ప‌నైన జ‌న్మ ఇచ్చిన ఆ దేవుడికి మాత్రం మ‌నం
ఏం ఇస్తున్నాం..ఎలా రుణాన్ని తీర్చుకుంటున్నామో ఆలోచించాలి.

ఆత్మ బంధువులారా న‌యా పైసా ఖ‌ర్చు లేని ప్రేమ‌ను పొందాలంటే ..మీరు  ప్రేమ‌ను పంచాలి. అపుడే సాధ్యం లేదంటే క‌ష్ట‌మే. ఇప్ప‌టికైనా మించి పోయింది లేదు..కాలం మీ చేతుల్లోనే ఉండాలంటే త‌ప్ప‌క ప్రేమ‌ను క‌లిగి ఉండాలి. ప్రేమ గొప్ప‌నైన భావ‌న కానే కాదు. అదొక మ‌నుషుల్ని ..దైవానికి మ‌ధ్య బంధాన్ని ప‌టిష్టం చేసే వంతెన ప్రేమ‌.

No comment allowed please