Covid19 : దేశంలో కొత్త‌గా 7,890 క‌రోనా కేసులు

అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్న కేంద్రం

Covid19 Updates : గ‌త వారం రోజుల నుంచి దేశంలో క‌రోనా కేసులు కొత్త‌వి నమోద‌వుతున్నాయి. ఇప్ప‌టికే కేంద్రం ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌ను అప్ర‌మ‌త్తం చేసింది. మౌలిక స‌దుపాయాలు క‌ల్పించాల‌ని, రోగుల‌కు ఇబ్బంది లేకుండా వ‌స‌తులు స‌మ‌కూర్చాల‌ని , అవ‌స‌ర‌మైన బెడ్స్ , ఆక్సిజ‌న్ ప‌రికరాల‌ను సిద్దంగా ఉంచాల‌ని ఆదేశించింది. ఈ మేర‌కు కోవిడ్ మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది.

మ‌రో వైపు ఓమిక్రాన్ వేరియంట్ వ‌ల్ల ఇబ్బంది ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని , నాలుగైదు రోజులు ఉంటుంద‌ని కోవిడ్ పాల‌సీ మానిటరింగ్ చైర్మ‌న్ డాక్ట‌ర్ ఎన్ కే ఆరోరా వెల్ల‌డించారు. తాజాగా 24 గంట‌ల్లో 7,000 కొత్త కేసులు(Covid19 Updates) న‌మోదు కావ‌డం విశేషం. గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ 1న దేశంలో ఒకే రోజు 7,946 కేసులు న‌మోదయ్యాయి.

ఇక మొత్తం కేసుల‌లో యాక్టివ్ కేసులు 0.09 శాతం ఉన్నాయి. బుధ‌వారం ఒక్క రోజే భారీ ఎత్తున క‌రోనా కేసులు న‌మోదు కావ‌డం విస్తు పోయేలా చేసింది. గ‌డిచిన 223 రోజుల‌లో ఇవే అత్య‌ధికం. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 40,215కి పెరిగింది. ఈ విష‌యాన్ని కేంద్ర కుటుంబ‌, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. అధికారికంగా ప్ర‌క‌ట‌న చేసింది.

ఇక క‌రోనా వ్యాధి కార‌ణంగా మ‌ర‌ణించిన వారి సంఖ్య 16 మంది. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ఇప్ప‌టి వ‌ర‌కు 5,31,016కు పెరిగింది. ఢిల్లీ, పంజాబ్ , హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో ఒక్కొక్క‌టి గుజ‌రాత్ , మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, హ‌ర్యానా, యూపీలలో ఒక్కొక్క‌రు క‌రోనా కార‌ణంగా ప్రాణాలు కోల్పోయారు. కేర‌ళ‌లో ఇవాళ ఉద‌యం ఒక‌రు మ‌రణించారు.

Also Read : పంజాబ్ మిలట‌రీ స్టేష‌న్ లో కాల్పులు

Leave A Reply

Your Email Id will not be published!