KTR : తెలంగాణకు రూ. 21 వేల కోట్లు – కేటీఆర్
దావోస్ టూర్ విజయవంతం
KTR : తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ స్విట్జర్లాండ్ లోని దావోస్ పర్యటన ముగిసింది. ఆయన వరుసగా దావోస్ ఆర్థిక సదస్సుకు ప్రతి ఏటా వెళుతున్నారు. రాష్ట్రం సాధించిన ప్రగతి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు , ప్రత్యేకించి వ్యాపారవేత్తలు, కార్పొరేట్లు, సంస్థలు, కంపెనీలకు ఇస్తున్న వెసలుబాట్ల గురించి దావోస్ లో జరిగిన ఆర్థిక సదస్సులో వివరించారు.
పలువురు ప్రపంచంలో పేరొందిన ప్రముఖులను కలుసుకున్నారు. వారిలో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ తో పాటు ఎయిర్ టెల్ చైర్మన్ తో భేటీ అయ్యారు. కేటీఆర్(KTR) పెట్టుబడులే లక్ష్యంగా ఇక్కడి నుంచి కీలకమైన బృందంతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా తన టూర్ ముగిసిన వెంటనే ఆనందాన్ని పంచుకున్నారు ఐటీ మంత్రి.
ఈ మేరకు ట్విట్టర్ లో కీలక దావోస్ టూర్ అత్యంత విజయవంతంగా ముగిసిందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా అక్కడి విశేషాలను తెలియ చేశారు కేటీఆర్. ఈ టూర్ లో రాష్ట్రానికి ఏకంగా రూ. 21, 000 కోట్లు పెట్టుబడులుగా వచ్చాయని స్పష్టం చేశారు. నాలుగు రోజులు పర్యటించామని , 52 వ్యాపార సంస్థలతో ములాఖత్ అయ్యానని తెలిపారు.
ఇదిలా ఉండగా ఐటీ దిగ్గజం హైదరాబాద్ లో రూ. 16 వేల కోట్లు, మరో డేటా సెంటర్లను కూడా ఏర్పాటు చేయనుందని తెలిపారు. అంతే కాకుండా ఆరు రౌండ్ టేబుల్ సమావేశాలు, 2 ప్యానెల్ మీటింగ్ లలో పాల్గొన్నట్లు వెల్లడించారు ఐటీ శాఖ మంత్రి(KTR). ఆదివారం హైదరాబాద్ లో కాలు మోపుతానని మిగతా పూర్తి వివరాలు వచ్చాక మీడియా సమావేశంలో వెల్లడిస్తానని పేర్కొన్నారు.
Also Read : మోడీ ప్రచారం తప్పా అభివృద్ది ఏది
All thanks to my wonderful Team led ably by @jayesh_ranjan Garu 👏 https://t.co/uA6V2yY0S7
— KTR (@KTRTRS) January 21, 2023