Tejashwi Yadav : బీజేపీకి ఎంఐఎం బి-టీమ్ – తేజస్వి
అసదుద్దీన్ ఓవైసీ పై షాకింగ్ కామెంట్స్
Tejashwi Yadav : ఆర్జేడీ చీఫ్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్(Tejashwi Yadav) షాకింగ్ కామెంట్స్ చేశారు. ముస్లింలకు ప్రతినిధిగా తనకు తాను చెప్పుకుంటున్న ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై నిప్పులు చెరిగారు. ఆయన ముస్లింల అభివృద్ది కోసం పని చేయడం లేదని మండిపడ్డారు
. ఓవైసీ కేవలం ఓటు బ్యాంకును చీల్చేందుకు ప్రయత్నం చేస్తున్నాడని ఆయనను ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు. పూర్తిగా కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీకి బి టీమ్ గా పని చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ హిందూ..ముస్లిం దేవాలయం..మసీదు పార్టీ అని డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ మండిపడ్డారు.
ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేగింది. బీజేపీ పట్ల జాగ్రత్తగా ఉండండి. వారు ఆటంకాలు కలిగించ వచ్చన్నారు తేజస్వి యాదవ్. బీహార్ లో మహాఘట్ బంధన్ పేరుతో ఏర్పాటైన ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంది లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీ.
గోప్లగంజ్ లోని యాదోపూర్ లో మహాఘట్ బంధన్ రాష్ట్రీయ జనతా దళ్ అభ్యర్థి మోహన్ ప్రసాద్ కు ఓటు వేయాలని విన్నవించారు. బీజేపీ కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కులం, ప్రాంతం, మతాల ప్రాతిపదికన ఓట్లను చీల్చేందుకు యత్నిస్తోందంటూ ఫైర్ అయ్యారు తేజస్వి యాదవ్.
Also Read : అమిత్ షాను అరెస్ట్ చేయండి – సిసోడియా