Owaisi Modi BBC Row : మోడీ సరే గాడ్సే మూవీ మాటేంటి
కేంద్రంపై నిప్పులు చెరిగిన ఎంపీ ఓవైసీ
Owaisi Modi BBC Row : ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నిప్పులు చెరిగారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సంబంధించి అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీపై కేంద్ర ప్రభుత్వం నిషేధం(Owaisi Modi BBC Row) విధించిందని మరి జాతిపిత మహాత్మా గాంధీని చంపిన నాథురామ్ గాడ్సే పై తీసిన సినిమా గురించి ఎందుకు ప్రస్తావించడం లేదంటూ ప్రశ్నించారు.
ప్రస్తుతం ఎంపీ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. మోడీ సీఎంగా ఉన్న హయంలో చోటు చేసుకున్న పరిణామాలను బీబీసీ వెలుగులోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేసిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ముఖ్యంగా మీడియాకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే, ప్రసారం , ప్రచురించే హక్కు ఉంటుందన్నారు ఓవైసీ.
మరి గాడ్సే పై తీసిన సినిమాపై ఇలాగే ఉక్కుపాదం మోపుతారా అంటూ నిలదీశారు ఎంఐఎం చీఫ్. ఇదిలా ఉండగా గాడ్సేపై తీసిన చిత్రం ఈ వారంలో దేశ వ్యాప్తంగా విడుదల కానుంది. మోడీ బీబీసీ డాక్యుమెంటరీపై కేంద్రం నిషేధం విధించింది. అన్ని సోషల్ మీడియాలను లింకులను బ్లాక్ చేయాలని ఆదేశించింది.
ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు గౌరవ్ వల్లభ్ , ఎంపీలు డెరిక్ ఓబ్రెయిన్ , మహూవా మోయిత్రా నిప్పులు చెరిగారు. ఈ సంందర్బంగా వారు డెమోక్రసీ ఎక్కడుందంటూ ప్రశ్నించారు. ఈ తరుణంలో ఓవైసీ చేసిన కామెంట్స్, సంధించిన ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ దేశంలో ప్రజాస్వామ్యం అన్నది లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఓవైసీ.
Also Read : మోడీ బీబీసీ డాక్యుమెంటరీ కలకలం