Owaisi House Attack : ఢిల్లీలో ఓవైసీ ఇంటిపై రాళ్ల దాడి

చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఫిర్యాదు

Owaisi House Attack : ఢిల్లీలోని ఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్ ఓవైసీ ఇంటిపై గుర్తు తెలియ‌ని దుండ‌గులు రాళ్ల‌తో దాడికి పాల్ప‌డ్డారు. స్వ‌యంగా ఇదే విష‌యాన్ని ఎంపీ ఆరోపించారు. ఈ మేర‌కు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.
ఇంటికి సంబంధించిన కిటికీలు ధ్వంసం అయ్యాయ‌ని వాపోయారు. ఇదిలా ఉండ‌గా ఈ ఘ‌ట‌న ఢిల్లీలోని అశోకా రోడ్ లోని ఎంఐఎం చీఫ్ నివాసంలో చోటు చేసుకుంది.

త‌న నివాసం వ‌ద్ద‌కు ఆదివారం సాయంత్రం గుర్తు తెలియ‌ని దండగులు వ‌చ్చి ఇంటిపై దాడి చేశారని పోలీస్ స్టేష‌న్ లో స్వ‌యంగా ఫిర్యాదు చేశారు ఎంపీ అస‌సుద్దీన్ ఓవైసీ. రాళ్లు రువ్వార‌ని , కిటికీల‌ను ధ్వంసం చేశార‌ని ఆరోపించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డం క‌ల‌క‌లం రేపింది. సీసీ కెమెరాను ప‌రిశీలించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు అస‌దుద్దీన్ ఓవైసీ(Owaisi House Attack).

సాయంత్రం 5.30 గంల‌కు ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇదిలా ఉండగా ఎంపీ ఫిర్యాదు మేర‌కు ఢిల్లీ పోలీసులు వెంట‌నే స్పందించారు. ఈ మేర‌కు డీసీపీ నేతృత్వంలోని పోలీసుల బృందం ఎంపీ నివాసానికి వెళ్లారు. ఘ‌ట‌న స్థ‌లం నుంచి ఆధారాలు సేక‌రించారు. రాత్రి 11.30 గంట‌ల‌కు నివాసానికి చేరుకున్నాను.

తిరిగి వ‌చ్చేస‌రికి కిటికీల అద్దాలు ప‌గిలి పోయి ఉన్నాయ‌ని, చుట్టూ రాళ్లు ప‌డి ఉండ‌డం గ‌మ‌నించాన‌ని చెప్పారు ఎంపీ ఓవైసీ. దుండుగ‌ల గుంపు దాడికి పాల్ప‌డింద‌ని త‌న స‌హాయ‌కుడు తెలిపాడ‌ని తెలిపారు. ఇలాంటి దాడి జ‌ర‌గ‌డం ఇది మొదటిసారి కాద‌ని, వ‌రుస‌గా నాలుగోసారి అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నిందితుల‌ను వెంట‌నే ప‌ట్టుకోవాల‌ని ఎంపీ కోరారు. ఈ మేర‌కు హోం శాఖ మంత్రికి లేఖ రాశారు ఎంపీ.

Also Read : బీజేపీకి షాక్ లింగాయ‌త్ లీడ‌ర్ జంప్

Leave A Reply

Your Email Id will not be published!