P Chidambaram : రూపాయి ప‌త‌నం చిదంబ‌రం ఆగ్ర‌హం

బీజేపీ స‌ర్కార్ నిర్వాకం వ‌ల్లే ఈ దుస్థితి

P Chidambaram : కాంగ్రెస్ అగ్ర నేత‌, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబ‌రం షాకింగ్ కామెంట్స్ చేశారు. గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా రూపాయి విలువ ప‌డిపోతుండ‌డంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

దీనికి ప్ర‌ధాన కార‌ణం కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ ప్ర‌భుత్వమేనంటూ మండిప‌డ్డారు. యుఎస్ డాల‌ర్ కు 80కి చేరుకోవ‌డం దారుణ‌మ‌ని పేర్కొన్నారు.

ఇంత జ‌రుగుతున్నా కేంద్రం స్పందించ‌క పోవ‌డం పై ఫైర్ అయ్యారు. యుఎస్ క‌రెన్సీకి వ్య‌తిరేకంగా రూపాయి 8 పైస‌లు కోలుకుని 79.91 వ‌ద్ద స్థిర ప‌డింది.

2013లో యూపీఏ ప్ర‌భుత్వం నాలుగు నెల‌ల్లోనే అమెరికా డాల‌ర్ తో పోలిస్తే రూపాయి విలువ‌ను 69 నుంచి 58కి తీసుకు వ‌చ్చింద‌ని తెలిపారు. జీడీపీ వృద్ది రేటు 2012-13లో 5.1 శాతం నుంచి 2013-14లో 6.9 శాతానికి పెరిగంద‌న్నారు.

బీజేపీ ప్ర‌భుత్వం చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఇంత‌కూ ఈ దేశంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఉన్న‌ట్లు క‌నిపించ‌డం లేదంటూ ఎద్దేవా చేశారు పి. చిదంబ‌రం(P Chidambaram).

ఈ దేశానికి ఆర్థిక శాఖ‌కు సంబంధించి ప్ర‌త్యేకంగా ఆర్థిక జ్యోతిష్కుడిని నియ‌మిస్తే బాగుంటుంద‌ని సూచించారు. ఇలా ఎంత‌కాలం దేశాన్ని అప్పుల‌తో నెట్టుకు వ‌స్తారంటూ ప్ర‌శ్నించారు.

ఓ వైపు ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను వ్యాపార‌వేత్త‌ల‌కు లీజుకు ఇవ్వ‌డమో లేదా గంప గుత్త గా అమ్మేస్తున్న స‌ర్కార్ ఎందుకు స్పందించం లేద‌ని నిల‌దీశారు పి. చిదంబ‌రం. ఇందుకోస‌మేనా మిమ్మ‌ల్ని ఎన్నుకున్న‌దంటూ ప్ర‌శ్నించారు.

ఓ వైపు ద్ర‌వ్యోల్బ‌ణం మ‌రో వైపు నిరుద్యోగం పెరుగుతున్నా మోదీ మాత్రం ఏమీ ప‌ట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ చిదంబ‌రం ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Also Read : 24 బిల్లులు ప్ర‌వేశ పెట్ట‌నున్న కేంద్రం

Leave A Reply

Your Email Id will not be published!