P Chidambaram : అగ్నిపథ్ పథకం కాంగ్రెస్ ఆగ్రహం
సాయుధ దళాల్లో లెక్కలేనన్ని పోస్టులు
P Chidambaram : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలు హాస్యాస్పదంగా ఉంటున్నాయని నిప్పులు చెరిగారు కాంగ్రెస్ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం(P Chidambaram).
గురువారం ఆయన కొత్తగా తీసుకు రానున్న అగ్నిపథ్ రిక్రూట్ మెంట్ స్కీంపై స్పందించారు. దేశ రక్షణలో సాయుధ దళాలు కీలక పాత్ర పోషిస్తాయి.
ఇందులో తాత్కాలికంగా కేవలం నాలుగు సంవత్సరాలకు మాత్రమే ఉద్యోగాలను భర్తీ చేయాలని అనుకోవడం దారుణమన్నారు. ఇది అవగాహన లేమికి, అంతకు మించి దేశ రక్షణ రంగం పట్ల అనుసరిస్తున్న వివక్షను తెలియ చేస్తోందని మండిపడ్డారు.
ఏ దేశమైనా ప్రపంచంలో ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని కానీ ఒక్క ఎన్డీయే తీసుకుందని సీరియస్ అయ్యారు. ఇప్పటి వరకు 60 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. త్వరలో ఎన్నికలు వస్తున్నాయి.
నిరుద్యోగం దేశానికి ప్రతిబంధకంగా , ప్రధాన సమస్యగా మారింది. ఈ తరుణంలో మోదీ తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారంటూ పి. చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ స్కీం ఒక అనాలోచిత పథకంగా అభివర్ణించారు. ఆర్మీని కూడా వ్యాపార పరంగా చేయాలని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు ఎంపీ.
లెక్కకు మించి ఆర్మీ పోస్టులు ఖాళీలు ఉండగా విస్తృత సంప్రదింపులు లేకుండానే ప్రభుత్వం అగ్నిపథ్ లాంటి స్కీంను తీసుకు రావాడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
గురువారం పి. చిదంబరం(P Chidambaram) ఢిల్లీలో మాట్లాడారు. ఇదిలా ఉండగా అగ్నిపథ్ స్కీం బీహార్ లో మంటలు రాజేసింది. యువత రోడ్డెక్కింది. ఆఫీసుపై దాడి చేశారు.
బీజేపీ ఎమ్మెల్యేను కొట్టినంత పని చేశారు. రైళ్లు నిలిచి పోయాయి. బోగీలకు నిప్పంటించారు.
Also Read : రైళ్ల ధ్వంసం ఎమ్మెల్వే వాహనంపై దాడి