P Sainath The lost Heroes : సామాన్యులు స‌మ‌ర యోధులు

పాల‌గుమ్మి సాయినాథ్ పుస్త‌కం సంచ‌ల‌నం

P Sainath The lost Heroes :  భార‌తీయ ప్ర‌చుర‌ణ‌, ప్ర‌సార మాధ్య‌మంలో పాల‌గుమ్మ సాయినాథ్ గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. ఆయ‌న రాసిన ఎన్నో అంశాలు దేశ ప్ర‌జ‌ల‌నే కాదు యావ‌త్ ప్ర‌పంచాన్ని విస్తు పోయేలా చేశాయి.

సాయినాథ్ తెలుగువాడు. ఇది ప‌క్క‌న పెడితే ఆయ‌న గ‌తంలో రాసిన పాల‌కుల‌కే కాదు రాజ‌కీయ నాయ‌కులకు క‌రువు, పేద‌రికం అనేది ఆయుధంగా ఉప‌యోగ ప‌డుతుంద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు.

ఆయ‌న తాజాగా మ‌రో కొత్త కోణాన్ని ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నంచేశారు. భార‌త దేశానికి స్వ‌తంత్రం వ‌చ్చి 75 ఏళ్లు పూర్త‌య్యాయి. 76వ సంవ‌త్స‌రంలోకి అడుగు పెట్టాం.

ఇవాళ చ‌రిత్ర‌లో కొంత మందికి మాత్ర‌మే చోటు ద‌క్కింది. కానీ వేలాది మంది బ‌లిదానాలు చేసుకున్నారు. దేశం ప్రాణాలు అర్పించిన వాళ్లున్నారు.

మ‌రి వీరితో పాటు చ‌రిత్ర‌కు నోచుకోని, లిఖించ‌బ‌డ‌ని వారు కూడా ఎంద‌రో ఉన్నారు. ఈ సంద‌ర్భంగా పాల‌గుమ్మి సాయినాథ్(P Sainath The lost Heroes) పాల‌కులు విస్మ‌రించిన హీరోల (వీరులు) గురించి ప్ర‌స్తావించారు.

వారిని ప‌రిచ‌యం చేసే ప్ర‌య‌త్నం చేశారు. ఆయ‌న రాసిన పుస్త‌కం పేరు ది లాస్ట్ హీరోస్..ఫుట్ సోల‌ర్జ‌ర్స్ ఆఫ్ ఇండియ‌న్ ఫ్రీడం. ఇందులో కీల‌క అంశాల‌ను ప్ర‌స్తావించారు.

వెలుగులోకి తీసుకు వ‌చ్చారు. ఇందులో ఆదివాసీలు, ద‌ళితులు, ఇత‌ర వెనుక‌బ‌డిన కులాలు, బ్రాహ్మ‌ణులు, ముస్లింలు, హిందువులు , స్త్రీలు, పురుషులు , చిన్న పిల్ల‌లు కూడా ఉన్నార‌ని పేర్కొన్నారు సాయినాథ్.

ఈ పుస్త‌కం సామ్రాజ్య‌వాదానికి వ్య‌త‌రేకంగా పోరాడిన సాధార‌ణ‌, రోజూ వారీ వ్య‌క్తుల గురించి తెలియ చేశారు. ఆనాటి పోరాటంలో ఇంకా బ‌తికే ఉన్న వారిలో ఎనిమిది ఉన్నార‌ని పేర్కొన్నారు ర‌చ‌యిత‌.

Also Read : మాతృ భాష‌ను మ‌రిచి పోవ‌ద్దు

Leave A Reply

Your Email Id will not be published!